Share News

Hair Fall: వర్షాల కారణంగా జుట్టు బాగా రాలిపోతోందా? ఇవి తినండి చాలు..!

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:07 PM

సీజన్ మారిన ప్రతి సారి ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురు కావడం అందరికీ తెలిసిందే. అయితే కేవలం ఆరోగ్యమే కాదు.. చర్మం, జుట్టు కూడా సమస్యలకు లోనవుతాయి.

Hair Fall: వర్షాల కారణంగా జుట్టు బాగా రాలిపోతోందా? ఇవి తినండి చాలు..!
Hair Fall

సీజన్ మారిన ప్రతి సారి ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురు కావడం అందరికీ తెలిసిందే. అయితే కేవలం ఆరోగ్యమే కాదు.. చర్మం, జుట్టు కూడా సమస్యలకు లోనవుతాయి. చర్మం పొడిబారడం, ర్యాషెస్ రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇవన్నీ వాతావరణంలోని అధిక తేమ కారణంగా జరుగుతాయి. వర్షాల కారణంగా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడంలో కొన్ని ఆహారాలు బాగా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే..

సీడ్స్, నట్స్..

సీడ్స్, నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్-ఇ సమృద్దిగా ఉంటుంది. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తాయి.

Olive Oil: సరైన ఆలివ్ ఆయివ్ ను ఎలా ఎంచుకోవాలి ? ఈ 5 చిట్కాలు ఫాలో అయితే సరి..!


గ్రీక్ యోగర్ట్..

గ్రీక్ పెరుగులో ప్రోటీన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడతాయి. గ్రీక్ పెరుగు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం ఆగుతుంది.

క్యారెట్లు..

క్యారెట్లలో బీటా- కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

చిలకడదుంపలు..

చిలకడదుంపలలో కూడా బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది సిస్తేజమైన జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది.

Herbal Water: ఇంట్లోనే హెర్భల్ వాటర్ ఇలా తయారు చేసుకుని తాగండి.. చర్మం మెరిసిపోవడం ఖాయం..!



స్ట్రాబెర్రీలు..

స్ట్రాబెర్రీలలో అధిక స్ఠాయిలో సిలికా ఉంటుంది. ఇది జుట్టు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడేవారు స్ట్రాబెర్రీలు తింటూ ఉంటే జుట్టు రాలడం ఆగడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఓట్స్..

ఓట్స్ లో ఫైబర్, జింక్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండ జుట్టు పెరుగుదలను ప్రేరేపించే పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి.

పప్పులు..

కాయధాన్యాలు, ప్రోటీన్, జింక్, ఐరన్, బయోటిన్ మొదలైనవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్-బి, విటమిన్-సి కూడా సమృద్దిగా ఉంటాయి.

Hair Care: ఆయుర్వేదం చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే.. తెల్లజుట్టు మాయమవుతుంది..!

Thyroid: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఆయుర్వేదం చెప్పిన ఈ మూలికలు వాడి చూడండి..!

Ginger Tea: మీకు అల్లం టీ అంటే ఇష్టమా? ఈ సమస్యలు ఉన్నవారు అల్లం టీ తాగకూడదట..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 30 , 2024 | 12:07 PM