Share News

Hair Fall: జుట్టు బాగా రాలుతోందా? షాంపూలో ఇదొక్కటి కలిపి వాడండి..

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:07 AM

జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడేవారు రకరకాల షాంపూలను మార్చి మార్చి వాడుతుంటారు. కానీ రెగ్యులర్ గా వాడే షాంపూలో ఇదొక్కటి కలిపి స్నానంచేస్తే జుట్టు రాలడం ఆగుతుంది.

Hair Fall: జుట్టు బాగా రాలుతోందా?  షాంపూలో ఇదొక్కటి కలిపి వాడండి..

జుట్టు రాలడం చాలామంది ప్రధాన సమస్య. జుట్టు అందంగా, పొడుగ్గా పెరగాలని కోరుకునే ప్రతి అమ్మాయి కలను ఈ జుట్టు రాలడం అనే సమస్య చిదిమేస్తూ ఉంటుంది. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, జుట్టుకు వాడే ఉత్పత్తులు, మానసిక ఒత్తిడి, తలస్నానానికి వాడే నీరు.. ఇలా చాలా విషయాలు జుట్టు రాలడానికి కారణం అవుతాయి. అయితే జుట్టు రాలడం ఆగాలంటే మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు వాడక్కర్లేదు.. రెగ్యులర్ గా వాడే షాంపూలోనే ఒకే ఒక వదార్థం కలిపి తలస్నానం చేస్తుంటే జుట్టు రాలడం ఆగుతుందట. ఇంతకీ జుట్టు రాలడం అరికట్టడానికి షాంపూలో కలపాల్సిందేమిటో తెలుసుకుంటే..

Instant Coffee: ఇన్సంట్ కాఫీ తాగడం మంచిదేనా.. వైద్యులు ఏమంటున్నారంటే..


తేనె..

  • తేనె కు ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇది సహజమైన తీపి పదార్థం కావడం చేత తేనెను ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఆయుర్వేద వైద్యంలో భాగంగా తేనెను ఔషదంగా కూడా ఉపయోగిస్తారు. అయితే తేనెను ఉపయోగించి జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు.

  • రెగ్యులర్ గా ఉపయోగించే షాంపూలో తేనెను కలిపి వాడటం వల్ల జుట్టు రాలడం ఆగుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు.. జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి.

  • తేనె జుట్టుకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అందిస్తుంది. ఇది జుట్టుకు మెరుపును ఇస్తుంది. జుట్టు మృదువుగా, పట్టుకుచ్చులా ఉండేలా చేస్తుంది.

Health Tips: వెల్లుల్లి ఇలా తింటే యూరిక్ యాసిడ్ సమస్య మాయం..


ఎలా వాడాలి..

షాంపూలో తేనె కలపడానికి షాంపూ, తేనె రెండింటిని సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేయాలి. దీన్ని తలకు పట్టించి సాధారణంగా షాంపూతో స్నానం చేసినట్టే చేయాలి. వారానికి రెండు సార్లు షాంపూతో తలస్నానం చేస్తుంటే జుట్టు రాలడం నుండి ఉపశమనం ఉంటుంది. కేవలం ఒక్క సారి వాడటంతోనే మార్పులు కనిపిస్తాయి.

తేనెతో పాటు షాంపూలో రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ను కొన్ని చుక్కలు కలిపి కూడా వాడవచ్చు. ఇలా చేస్తే జుట్టు రాలడం ఆగడం, జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జుట్టు వేగంగా పెరుగుతుంది కూడా.

ఇది కూడా చదవండి..

30రోజులు ఉల్లి, వెల్లుల్లి తినడం మానేస్తే శరీరంలో కలిగే మార్పులివే..

15రోజులు ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఏం జరుగుతుంది..?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 05 , 2024 | 11:15 AM