Share News

Hair Growth: ఈ ఆహారాలు తినండి చాలు.. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడం ఖాయం..!

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:52 PM

జుట్టు రాలిపోవడం, జుట్టు పలుచబడిపోవడం, బూడిద రంగులోకి మారడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటికి చెక్ పెట్టాలన్నా, జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా..

Hair Growth: ఈ ఆహారాలు తినండి చాలు.. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడం ఖాయం..!
Hair Growth

అమ్మాయిలు ముఖ సౌందర్యం గురించి, కేశ సంరక్షణ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. జుట్టు ఒత్తుగా, నల్లగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే ఇప్పటి కాలం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం అన్నీ కలిసి జుట్టు పెరుగుదల మీద ప్రభావం చూపిస్తున్నాయి. జుట్టు రాలిపోవడం, జుట్టు పలుచబడిపోవడం, బూడిద రంగులోకి మారడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటికి చెక్ పెట్టాలన్నా, జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా కింది ఆహారాలు తీసుకోవాలి..

గుడ్లు..

గుడ్లలో బయోటిన్, విటమిన్-ఎ, డి పుష్కలంగా ఉంటాయి. ఒక గుడ్డులో దాదాపు 6గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్లలో ఉండే జింక్, సెలీనియం జుట్టుకు రక్షణ ఇస్తాయి.

నెయ్యితో మసాజ్ చేస్తే యవ్వనంగా మారతారా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!


గ్రీక్ పెరుగు..

గ్రీక్ పెరుగులో కాల్షియం, ప్రోబయోటిక్స్ తో పాటూ ప్రోటీన్ కూడా ఉంటుంది. విటమిన్-బి5 గ్రీక్ పెరుగులో ఉంటుంది. ఇది తలలో రక్తప్రసరణను పెంచుతుంది.

చికెన్ బ్రెస్ట్..

చికెన్ బ్రెస్ట్ ప్రోటీన్ కు మూలం. 100గ్రాముల చికెన్ బ్రెస్ట్ లో 37గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జుట్టు కుదుళ్ల కణజాలాలు మరమ్మత్తుకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి.

కాయధాన్యాలు..

కాయధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఫైబర్, ఐరనా్, ఫోలెట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి కెరాటిన్ ఉత్పత్తికి, ఆక్సిజన్ ప్రసరణకు, తల చర్మం, జుట్టుకు పోషణ అందించడంలోనూ సహాయపడుతుంది.

ఈ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో జుట్టు రాలడం ఆగిపోతుంది..!



బాదం..

బాదంలో విటమిన్-ఇ ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడటంలోనూ, స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండటంలోనూ బాదం సహాయపడుతుంది.

క్వినోవా..

క్వినోవాలో మొత్తం 9 అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇందులో పైబర్, ఐరన్, మెగ్నీషియం సమృద్దిగా ఉంటాయి. జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి, బలానికి, నెత్తిమీద రక్తప్రసరణ మెరుగ్గా ఉంచడంలోనూ, ప్రోటీన్ సంశ్లేషణకు ఇది సహాయపడుతుంది.

సాల్మన్..

సాల్మన్ చేపలలో ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-డి, విటమిన్-బి12, ఇందులో ఉంటాయి. జుట్టు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచడంలోనూ, జుట్టు పెరుగుదలలో ఇవి సహాయపడతాయి.

ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు నమిలి తింటే.. వీరికి భలే లాభాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 03 , 2024 | 05:52 PM