Hair Growth: ఏం చేసినా జుట్టు పెరగట్లేదా? ఇవి తినండి చాలు..!
ABN , Publish Date - Jan 21 , 2024 | 04:03 PM
చాలామందికి తెలియదు కానీ జుట్టు బాగా పెరగాలంటే తప్పకుండా తినాల్సిన ఆహారాలివి.
జుట్టు పెరుగుదల చాలావరకు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. జుట్టు పెరగట్లేదని, బాగా రాలిపోతోందని ఫిర్యాదు చేసేవారు దాన్ని నియంత్రించడానికి షాంపూలు, నూనెలు వాడుతుంటారు. అయతే జుట్టు రాలడాన్ని అరికట్టడం నుండి తిరిగి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కొన్ని ఆహారాలు తీసుకోవాలి. జుట్టు ఎందుకు రాలుతుందో.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఏం తినాలో తెలుసుకుంటే..
జుట్టు రాలడానికి జన్యువులు లేదా వైద్య పరిస్థితులు చాలావరకు కారణం అవుతయి. కానీ కొందరిలో ఆహారం సరిగా లేకపోవడం కూడా జుట్టు జుట్టు రాలడానికి కారణం అవుతుంది. చాలావరకు హీట్ స్టైలింగ్ టూల్స్, కెమికల్ ట్రీట్‌మెంట్‌లతో పాటూ ఎమోషన్ గా ఒత్తిడికి గురికావడం, హార్మోన్ల అసమతుల్యత, జుట్టు గురించి తగినంత శ్రద్ద తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల జుట్టు బాగా రాలిపోతుంది.
ఇది కూడా చదవండి: నెలరోజుల పాటూ మాంసాహారం తినడం మానేస్తే.. ఏం జరుగుతుందంటే..!
జుట్టు బాగా పెరగాలంటే ఏం తినాలి?
జుట్టు పెరుగుదలకు పప్పు ధాన్యాలు బాగా సహాయపడతాయి.
పెసరపప్పు..
ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల పెసరపప్పు జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు దోహదపడే బయోటిన్ పెసరపప్పులో ఉంటుంది.
ఎర్రకందిపప్పు..
ఎర్రకందిపప్పును మసూర్ దాల్ అని కూడా అంటారు. ప్రోటీన్, జింక్, బయోటిన్ అధికంగా ఉండటం వల్ల ఎర్రకందిపప్పు చాలా ఆరోగ్యం. ఐరన్ కంటెంట్ జుట్టు ఫోలికల్స్ కు ఆక్సిజన్ ను మెరుగ్గా సరఫరా చేయడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Weight Loss: బాగా లావున్నారా? ఇలా చేస్తే చాలు.. 10 నుండి 30 కిలోలైనా ఈజీగా తగ్గడం ఖాయం!
మినప్పప్పు..
మినపప్పులో ఐరన్, ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
ఎలా వాడాలంటే..
ఈ పప్పు ధాన్యాలను ఆహారంలో భాగంగానే కాకుండా తలకు హెయిర్ ప్యాక్ గా కూడా వేసుకుంటూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగడమే కాదు మంచి ఆకృతిలో మెరుస్తుంది కూడా.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.