Health Benefits Of Curd: పెరుగు ఈ సమయంలో తింటే 4 రెట్ల ప్రయోజనం ఉంటుంది..!
ABN , Publish Date - Jun 11 , 2024 | 03:14 PM
Health Benefits Of Curd: ఆయుర్వేదం ప్రకారం.. పెరుగును రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, పెరుగు తినే సమయం కూడా చాలా కీలకం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మంది పెరుగును అన్నంతో కలిపి తింటారు.
Health Benefits Of Curd: ఆయుర్వేదం ప్రకారం.. పెరుగును రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, పెరుగు తినే సమయం కూడా చాలా కీలకం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మంది పెరుగును అన్నంతో కలిపి తింటారు. ఉదయం గానీ.. మధ్యాహ్నం గానీ.. రాత్రి భోజనంలో గానీ పెరుగు తింటుంటారు. పెరుగు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది.
విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధన ప్రకారం.. భోజనానికి ముందు పెరుగు తినే స్త్రీలలో పేగు మంటలను తగ్గించినట్లు గుర్తించారు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందిన నిర్ధారించారు. అయితే, పెరుగు తినేందుకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం ప్రకార తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది. ఏదైనా జీర్ణ సమస్య ఉంటే.. రాత్రిపూట పెరుగు తినడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. పెరుగులో కొవ్వు, ప్రోటీన్ల పుష్కలంగా ఉంటాయి. దీనిని రాత్రిపూట తినడం వల్ల జీర్ణం కావడానికి సమయం పడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
పెరుగు తినడానికి ఉత్తమ సమయం.. ఉదయం, మధ్యాహ్నం. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఉదయం గానీ.. మధ్యాహ్నం గానీ పెరుగుతో భోజనం చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. పగటిపూట పెరుగుతో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ కూడా మెరగవుతుంది. సులభంగా జీర్ణం అవుతుంది.
పెరుగు ఎప్పుడు తినొద్దు.. ఎవరు తినొద్దు..
పెరుగును రాత్రిపూట తినకూడదు. పెరుగును వేడి చేసి తినొద్దు. పెరుగులో ఉప్పు, పాలు, చేప, నెయ్యి, తేనె కలిపి కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. పాల ఉత్పత్తులు అలెర్జీ అయితే.. పెరుగు తినడం మానేయాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు పెరుగును తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. చల్లని వాతావరణంలో పెరుగు తినడం మంచిది కాదు.
పెరుగుతో ప్రయోజనాలు..
పెరుగును శరీరానికి పట్టించి స్నానం చేయడం వల్ల చర్మం మృదువుగా, అందంగా మారుతుంది. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి ఉన్నాయి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. మధ్యాహ్నం పెరుగు తినడం శరీరానికి శక్తిని అందిస్తుంది. వ్యాయామాలు, రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయడంలో సహాయపడుతుంది.