Sleeping Tips: నిద్ర పట్టడం లేదా... ఇలా చేస్తే పడుకున్న వెంటనే నిద్ర పోతారు..
ABN , Publish Date - Dec 09 , 2024 | 01:39 PM
నిద్రలేమి ఒక సాధారణ సమస్య. అలా అని ఎలాంటి జాగత్రలు తీసుకోకుండా ఉంటే మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tips to Sleep: కొంత మంది ఏం చేసినా నిద్రపట్టక అవస్థలు పడుతుంటారు. ఇది ఒక సాధారణ సమస్య. అలా అని ఎలాంటి జాగత్రలు తీసుకోకుండా ఉంటే మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే గాఢనిద్ర లోకి పోతారని నిపుణులు సూచిస్తున్నారు.
నెగిటివ్ ఫీలింగ్ తీసియండి..
'నాకు నిద్ర పట్టదు' అనే నెగిటివ్ ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు. ముందుగా ఆ నెగెటివ్ ఫీలింగ్ ను మైండ్ లోని నుంచి తీసివేయాలి. 'నేను బాగా నిద్రపోగలను' అనే పాజిటివ్ ఫీలింగ్ కలిగి ఉండాలి. అప్పుడు సానుకూల భావోద్వేగాలు శరీరంలో నిద్రను ప్రేరేపించే హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోగలరు.
ఆరోగ్యంపై ప్రభావం..
మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే, బాగా నిద్రపోవడం ఎంత ముఖ్యమో బాగా తినడం కూడా అంతే ముఖ్యం. మంచి నిద్ర అంటే మధ్యలో లేవకుండా కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు నిద్రపోవడం. కానీ, ఇటీవలి కాలంలో చాలా మంది సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక సాధారణ వ్యాధిగా మారింది. నిద్రలేమి సమస్యను నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి అనేక ఇతర వ్యాధులకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి తొందరగా తినడం మంచిది. పడుకునే ముందు మొబైల్, టీవీని చూడకండి, పాలు తాగండి, పడుకోవడానికి ముందు కాసేపు నడవండి, అప్పుడు మీరు అలసిపోతారు కాబట్టి వెంటనే బాగా నిద్రపడుతుంది. ఒకవేళ ఈ పనులు అన్నీ చేసినా మీకు నిద్ర రాకపోతే మీ మానసిక స్థితి బాగోలేదని అర్థం చేసుకోవాలి. సంగీతం వింటూ నిద్ర పోవడానికి ట్రై చేయండి. దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. పై చిట్కాలు పాటిస్తూ బాగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)