Lemon: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నిమ్మ పండు విషం లాంటిది..
ABN , Publish Date - Dec 05 , 2024 | 05:23 PM
కొన్నిరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నిమ్మరసం తక్కువగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిమ్మరసాన్ని తీసుకోవడం మంచిది కాదో ఈ కథనంలో తెలుసుకుందాం..
Lemon: నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ సవ్యంగా ఉంటుందని, బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఎక్కువ మంది నిమ్మకాయ రసాన్ని తాగేందుకు ఇష్టపడతారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు నిమ్మ రసం అధికంగా తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిమ్మరసాన్ని తీసుకోవడం మంచిది కాదో ఈ కథనంలో తెలుసుకుందాం..
దంత సమస్యలు..
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పంటి ఎనామిల్‌ను బలహీనపరుస్తుంది. రోజూ నిమ్మరసం తాగడం వల్ల దంతాల ఎనామిల్ కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, దంత సమస్యలు ఉన్నవారు నిమ్మరసం తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
యాసిడ్ రిఫ్లక్స్..
నిమ్మరసం కడుపులో యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఎసిడిటీ సమస్య ఉన్నవారు లెమన్ వాటర్ తాగడం మంచిది కాదు. నిమ్మకాయ నీటిలో కడుపు కణజాలాన్ని దెబ్బతీసే యాసిడ్ ఉంటుంది. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
మలబద్ధకం..
నిమ్మకాయ నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. మీకు ఇప్పటికే మలబద్ధకం సమస్య ఉంటే లెమన్ వాటర్ తాగడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి, మలబద్ధకం ఉన్న వారు నిమ్మకాయ నీరు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
అలెర్జీ..
కొంతమందికి నిమ్మకాయ అంటే అలెర్జీ ఉంటుంది. నిమ్మకాయ అంటే అలెర్జీ ఉన్నవారు సిట్రస్ పండ్లను తింటే దురద, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గొంతులో వాపు కూడా వస్తుంది. కాబట్టి, అలాంటి వారు నిమ్మకాయకు దూరంగా ఉండడం మంచిది.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)