Share News

Health Tips: ఈ 3 రకాల డ్రై ఫ్రూట్స్ ను తేనెలో నానబెట్టి తినండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:37 PM

డ్రై ప్రూట్స్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది. పైగా వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం మూలాన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే డ్రై ప్రూట్స్ ను తేనెలో నానబెట్టుకుని తింటే జరిగేదేంటి?

Health Tips: ఈ 3 రకాల డ్రై ఫ్రూట్స్ ను తేనెలో నానబెట్టి తినండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!
Dry Fruits

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పోషకాల లోపం ఉండదని చెబుతుంటారు. డ్రై ప్రూట్స్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది. పైగా వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం మూలాన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే డ్రై ప్రూట్స్ ను తేనెలో నానబెట్టుకుని తింటే జరిగేదేంటి? చాలా మంది ఇష్టంగా, విరివిగా తినే జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలను తేనెలో నానబెట్టుకుని తింటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

రోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే ఈ సమస్యలు ఉన్నవారికి భలే లాభాలు..!


జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలను తేనెలో నానబెట్టి తింటే..

  • ఈ మూడింటిని తేనెలో నానబెట్టుకుని తింటే అనారోగ్యం పాలైన శరీరం తిరిగి తొందరగా కోలుకుంటుంది. తేనెలో నానబెట్టిన డ్రై ప్రూట్స్ తింటే శరీరానికి శక్తి లభిస్తుంది.

  • జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్షలను తేనెలో కలిపి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే అది తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది.

  • తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శరీరంలో చక్కెర స్థాయిలు బ్యాలెన్స్ గా ఉండటంలో ఇది సహాయపడుతుంది.

  • జీడిపప్పు, తేనె, ఎండుద్రాక్షలను తేనెలో నానబెడితే వాటిలో పోషకాలు రెట్టింపు అవుతాయి. వీటిని తింటూ ఉంటే జుట్టు, గోర్లు, చర్మం, ఎముకలు బలపడతాయి. ఏ యే డ్రై ఫ్రూట్ లో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే..

మీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? అయితే మీరు లక్కీ..!


బాదంలో..

బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్-ఇ, మెగ్నీషియం, కాపర్, ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్-బి కు సంబంధించిన నియాసిన్, థయామిన్, ఫోలెట్ కూడా ఉంటాయి.

జీడిపప్పులో..

జీడిపప్పులో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటిలో కాపర్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు.. విటమిన్-కె, ఇ, విటమిన్-బి వర్గానికి చెందిన విటమిన్లు కూడా ఉంటాయి.

ఎండుద్రాక్షలో..

ఎండుద్రాక్షలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం, కాపర్, విటమిన్-బి6, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.

తేనెలో..

తేనెలో అవసరమైన పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు చాలా ఉంటాయి. ఇందులో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా కార్బోహైడ్రేట్లు, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్-బి6, విటమిన్-సి, అమైనో ఆమ్లాలు ఉంటాయి. తేనెలో డ్రైప్రూట్స్ ను నానబెట్టడం వల్ల తేనెలో పోషకాలు డ్రై ప్రూట్స్ కు అంది వాటిలో పోషకాలు మెరుగవుతాయి.

ఇవి కూడా చదవండి..

Health tips: బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తే జరిగేదేంటి? మీకు తెలియని నిజాలివీ..!

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 18 , 2024 | 04:37 PM