Share News

Health Tips: నవ రాత్రులలో 9 రోజుల ఉపవాసం పాటించారా? అయితే ఈ నిజాలు మీ కోసమే..!

ABN , Publish Date - Oct 11 , 2024 | 05:46 PM

దేవీ నవ రాత్రులలో చాలామంది ఉపవాసం ఉంటారు. అలాంటి వారు ఎదుర్కునే సమస్యలు ఇవే..

Health Tips:  నవ రాత్రులలో 9 రోజుల ఉపవాసం పాటించారా? అయితే ఈ నిజాలు మీ కోసమే..!
Fasting

దేవీ నవరాత్రులలో దేశ వ్యాప్తంగా అమ్మవారిని ఎంతో భక్తిపూర్వకంగా ఆరాధిస్తారు. చాలామంది తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. సాధారణంగా ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే అయినా తొమ్మిది రోజులు ఉపవాసం ఆచరించడం వల్ల శరీరం మీద ప్రభావం ఉంటుంది. ఇది శరీరానికి ఒక రకంగా మంచి చేసినప్పటికీ మరొకవైపు రూజువారి శరీరపు దినచర్య మారిపోవడం వల్ల శరీరం అసౌకర్యానికి గురవుతుంది. నవరాత్రులలో చాలామంది ఎదుర్కునే సమస్యలు.. వాటి పరిష్కారాల గురించి ఆలోచిస్తే..

Jackfruit: పనసపండును ఇష్టంగా తినేవారు ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు..!


మలబద్దకం..

ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల చాలామంది మలబద్దకం సమస్యను ఎదుర్కుంటారు. ఉపవాస సమయంలో తీసుకునే ఆహారం వేరు కావడం వల్ల జీర్ణక్రియ ఇబ్బందికి లోనవుతుంది. ప్రేగు కదలికలలో సమస్యలు ఏర్పడతాయి. డీహైడ్రేషన్, శారీరక శ్రమ లేకపోవడం మొదలైనవి కూడా మలబద్దకం కు కారణం అవుతాయి.

ఉపవాసం ఉండి మలబద్దకం సమస్య ఉన్నవారు మంచి నీరు బాగా తాగాలి. ఉపవాస ఆహారంలో నీరు శాతం, ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి. గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆవు నెయ్యి కలిపి తీసుకోవాలి. మలబద్దకం సమస్య తగ్గుతుంది.

ఉబ్బరం..

నవరాత్రి సమయంలో సాత్వికాహారం తీసుకోవాలి. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోకూడదు. వీటి వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.

కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు ఆహారం తీసుకోకుండా వాకింగ్ చేయాలి. మందార పువ్వు టీ, లెమన్ టీ వంటివి తాగాలి. ఇంట్లో తయారు చేసిన తేలికపాటి ఆహారాలు తీసుకోవాలి.

Hair Care: జుట్టు దువ్వేటప్పుడు చేసే ఈ పొరపాట్లే జుట్టు రాలడానికి అసలు కారణాలు..!


అలసట..

నవ రాత్రులలో 9 రోజులు ఉపవాసం చేయడం వల్ల అలసట ఉంటుంది. పోషకాహారం తీసుకోకపోవడం, నీరు తక్కువగా తాగడం మొదలైనవి అలసటకు కారణం అవుతాయి.

అలసట తగ్గడానికి నీరు బాగ తాగుతుండాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, తులసి నీరు, అల్లం నీరు వంటి హెర్బల్ డ్రింక్స్ కూడా ప్రయత్నించాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. శరీరానికి శక్తిని ఇస్తాయి.

తలనొప్పి..

ఆహారం సరిగా తీసుకోనప్పుడు చాలామంది తలనొప్పితో బాధపడుతుంటారు. ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది తలనొప్పికి కారణం అవుతుంది. శరీరంలో నీరు లోపించడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది కూడా తలనొప్పికి కారణం అవుతుంది.

తలనొప్పి ఉంటే నీరు బాగా తాగాలి. పండ్ల రసం, కొబ్బరినీరు వంటివి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా జీడిపప్పు, బాదం, ఫూల్ మఖానా వంటివి తిన్నా శరీరానికి శక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి..

Skin Care: కళ్ల కింద చర్మం ముడతలు పడిందా? ఈ ఐ ప్యాక్ ట్రై చేయండి..!

Phool Makhana: మగవాళ్లకు ఫూల్ మఖానా చేసే మేలెంత? మీకు తెలియని నిజాలివి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 11 , 2024 | 05:46 PM