Share News

Health Tips: వామ్మె.. ఫ్రిజ్‌లో మిగిలిపోయిన పిండిని ఉపయోగిస్తే ఇన్ని నష్టాలా..

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:54 PM

ఈ రోజుల్లో చాలా మంది మిగిలిన పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచుతున్నారు. అయితే, అలా ఉంచిన పిండిని ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో మీకు తెలుసా?

Health Tips: వామ్మె.. ఫ్రిజ్‌లో మిగిలిపోయిన పిండిని ఉపయోగిస్తే ఇన్ని నష్టాలా..
fridge

Health Tips: ఫ్రిజ్‌లో ఉంచిన పిండిని తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఉద్యోగం హడావిడి ఉంటుందని ముందుగానే రాత్రిపూట పిండిని కలిపి ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు దాని నుండి రోటీలు చేస్తారు. ఇలా చేయడం వల్ల మార్నింగ్ టైం సేవ్ అవుతుందని అనుకుంటారు. ఇంకొంత మంది.. పిండి ఎక్కువ అయిందని తర్వాత చేసుకుని తినవచ్చులే అని ఫ్రిజ్ లో పెడతారు. నిజానికి ఇలా ఫ్రిజ్ లో పెట్టిన పిండితో చేసిన చపాతీ లేదా రోటీని తీసుకోవడం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధుల బారినపడతారని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి ఇది ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.


ఫంగల్ ఇన్ఫెక్షన్..

రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పిండి ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఇది మీ శరీరంలో ఒక రకమైన అలెర్జీని కలిగిస్తుంది. ఇది దీర్ఘకాలంలో సమస్యలను కలిగిస్తుంది. వికారంగా అనిపించడం, తరచుగా వాంతులు వంటి ఆరోగ్య సమస్యలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

జీర్ణక్రియకు భంగం..

రిఫ్రిజిరేటెర్ లో ఉంచిన పిండిని ఉపయోగిస్తే అది మీ జీర్ణవ్యవస్థను వినాశనం కలిగిస్తుంది. ఇది అతిసారం, కడుపు ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. కాబట్టి, అలా ఫ్రిజ్ లో ఉంచిన పిండిని ఉపయోగించకపోవడం చాలా ఉత్తమం.

ప్రేగు సంబంధిత ఇన్ఫెక్షన్లు:

రిఫ్రిజిరేటర్ లో ఉంచిన పిండి పేగు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. దీని కారణంగా, మీ గట్ బ్యాక్టీరియా, మైక్రోబయోటా చెదిరిపోవచ్చు. ఇది చాలా కాలం పాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలను కలిగిస్తుంది. చపాతీలు లేదా రోటీలు చేయడానికి అవసరమైనంత పిండిని మాత్రమే ఉపయోగిస్తే మంచిది. తద్వారా మీరు పేగు ఇన్ఫెక్షన్ల నుండి సురక్షితంగా ఉంటారు.

(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)

Updated Date - Dec 10 , 2024 | 12:55 PM