Share News

Health Tips: సులైమాని టీ గురించి విన్నారా? దీన్ని తాగితే ఎన్ని లాభాలంటే..!

ABN , Publish Date - Aug 31 , 2024 | 10:32 AM

సులైమాని టీ అనేది చాలా పాతకాలపు వంటకం. దీని తయారీ పద్దతి చాలా ప్రత్యేకం. విభిన్న రకాల టీలు ఇష్టపడేవారు సులైమాని టీని తప్పకుండా ఇష్టపడతారు.

Health Tips: సులైమాని టీ గురించి విన్నారా? దీన్ని  తాగితే ఎన్ని లాభాలంటే..!
Sulaiman Tea

సులైమాని టీ అనేది చాలా పాతకాలపు వంటకం. దీని తయారీ పద్దతి చాలా ప్రత్యేకం. దీన్ని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా తయారుచేస్తారు. విభిన్న రకాల టీలు ఇష్టపడేవారు సులైమాని టీని తప్పకుండా ఇష్టపడతారు. ఈ టీ కేవలం రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూర్చుతుంది. ఈ టీ తయారీ విధానం, దీని తయారీకి కావలసిన పదార్థాలు, దీని ప్రయోజనాలు తెలుసుకుంటే..

పండిన అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు నిజాలు ఇవీ..!


కావలసిన పదార్థాలు..

  • నీరు..

  • తేనె..

  • టీ ఆకులు..

  • లవంగాలు..

  • పచ్చి ఏలకులు..

  • దాల్చిన చెక్క..

  • అల్లం..

  • నిమ్మరసం..

  • పుదీన ఆకులు..

తయారు విధానం..

  • పాన్ లో రెండు కప్పుల నీటిని పోసి మరించాలి. వేడి నీటిలో లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, పుదీన ఆకులు, యాలకులు వేసి బాగా ఉడకనివ్వాలి.

  • నీరు సగానికి తగ్గిన తరువాత ఇందులలో టీ ఆకులు వేసి, పాన్ మీద మూత పెట్టి స్టౌ ఆఫ్ చేయాలి.

  • 5నిమిషాల పాటు టీ ఆకులు వేడి నీటిలో ఉంచితే సులైమాని టీ రెఢీ అయినట్టే.

  • సులైమాని టీని ఒక కప్పులో వేసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి సేవించాలి.

విటమిన్-సి ఆడవాళ్ల కంటే మగవారికే ఎక్కువ ముఖ్యం.. ఎందుకంటే..!


ప్రయోజనాలు..

  • సులైమాని టీని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

  • అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడేవారు సులైమాని టీ తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

  • సులైమాని టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కింద నల్లని వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి.

  • అలసటగా అనిపించినప్పుడు సులైమాని టీ తాగితే ఉత్సాహం వస్తుంది.

  • సులైమాని టీ గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

ఇవి కూడా చదంవడి..

ఈ కారణాల వల్ల పెళ్ళిళ్లు చేసుకోకండి.. వివాహ బంధం నిలబడదు..!

కేవలం ఈ 9 అలవాట్లతో మీరు జెమ్ అయిపోతారు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 31 , 2024 | 10:32 AM