Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొరపాటున కూడా వీటిని తినకండి..!
ABN , Publish Date - Jun 30 , 2024 | 03:13 PM
రాత్రి భోజనం చేసిన తరువాత నుండి ఉదయం వరకు ఆహారం ఏమీ తీసుకోము. ఖాళీ కడుపు కారణంగా జీర్ణవ్యవస్థ వేగం మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని ఆహారాలు ఉదయాన్నే తీసుకుంటే ..
ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల చాలా మందికి గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రి భోజనం చేసిన తరువాత నుండి ఉదయం వరకు ఆహారం ఏమీ తీసుకోము. ఖాళీ కడుపు కారణంగా జీర్ణవ్యవస్థ వేగం మందగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని ఆహారాలు ఉదయాన్నే తీసుకుంటే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీనికి కారణం ఆ ఆహారాలు ఎక్కువ యాసిడ్ ఉత్పత్తి చేసేవి కావడమే. దీనివల్ల పొట్టలో యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి. ఉదయం పూట కింది ఆహారాలు తీసుకోవడం మానేస్తే గ్యాస్ సమస్య ఉండదు.
Health Tips: ఈ 3 తినండి చాలు.. 60 ఏళ్లు వచ్చినా యవ్వనంగా ఉంటారు..!
పచ్చి ఉల్లిపాయ..
కొంతమంది ఉదయాన్నే పచ్చి ఉల్లిపాయను తింటారు. దీని వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. దీనికి కారణం ఉల్లిపాయలో ఉండే కొన్ని మూలకాలు. ఉల్లిపాయలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది జీర్ణం కావడం కష్టం. అంతే కాకుండా గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది.
కాఫీ..
కొంతమందికి ఖాళీ కడుపుతో కాఫీ తాగితే గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాఫీ కడుపులో యాసిడ్ స్థాయిలు పెంచుతుంది.
టమోటా..
ఉదయాన్నే ఆరోగ్యం కోసం టమోటాలు తినడం లేదా టమోటా జ్యూస్ తాగడం చేస్తుంటారు. అయితే టమోటాలలో అధిక మొత్తంలో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కడుపులో ఆమ్లతత్వం, పుల్లని త్రేన్పులు కలిగిస్తుంది. అందువల్ల టమోటాలు ఉదయాన్నే తినేవారు ఎక్కువ ఎసిడిటీ సమస్యలు కలిగి ఉంటారు. అలాగే ఎసిడిటీ ఉన్నవారు వీటిని ఖాళీ కడుపుతో తినకూడదు.
White Bread: అల్పాహారంలో బ్రెడ్ జామ్ తింటూంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!
పాలు..
ఉదయం లేచి బ్రష్ చేసిన వెంటనే పాలు తాగడం కొందరికి అలవాటు. అయితే పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటే గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. దీనికి ప్రధాన కారణం లాక్టోస్ అసహనం. లాక్టోస్ అసహనం సమస్య ఉన్నవారిలో జీర్ణవ్యవస్థ లాక్టోస్ ను జీర్ణించుకోలేదు. ఇది కూడా గ్యాస్ సమస్యకు కారణం అవుతుంది.
సిట్రస్ పండ్లు..
ఉదయం పూట ఖాళీ కడుపుతో పుల్లని పండ్లు తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఖాళీ కడుపుతో నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లు తినకూడదు. లేదంటే కడుపులో యాసిడ్ పెరిగి గ్యాస్ సమస్య పెరుగుతుంది.
Life Lesson: మీ జీతం ఎంత అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? రిటైర్డ్ ఐఏఎస్ ఇచ్చిన సలహా ఇది..!
Hair Tonic: ఈ హెయిర్ టానిక్ ఉపయోగించి చూడండి.. జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.