Health Tips: ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది..!
ABN , Publish Date - Mar 26 , 2024 | 12:10 PM
UTI Symptoms: ప్రస్తుత కాలంలో మూత్రసంబంధిత వ్యాధులు(Urin Infections) పెరుగుతున్నాయి. ముఖ్యంగా UTI వ్యాప్తి కేసులు పెరుగుతున్నాయి. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ.. శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. UTI వ్యాప్తి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. పొత్తి కడుపులో నొప్పి..
UTI Symptoms: ప్రస్తుత కాలంలో మూత్రసంబంధిత వ్యాధులు(Urin Infections) పెరుగుతున్నాయి. ముఖ్యంగా UTI వ్యాప్తి కేసులు పెరుగుతున్నాయి. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ.. శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. UTI వ్యాప్తి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. పొత్తి కడుపులో నొప్పి, అసౌకర్యం, మూత్రాశయం, దిగువ పొత్తికడుపులో ఉన్న మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. యూటీఐకి సరైన సమయంలో చికిత్స అందించకపోతే కిడ్నీ పాడయ్యే అవకాశం ఉంది. అనేక సందర్భాల్లో ప్రజలు యూటీఐ ప్రారంభ లక్షణాలను విస్మరిస్తారు. దీని కారణంగా సమస్య మరింత పెరుగుతుంది.
యూరాలజి నిపుణుల ప్రకారం.. యూటీఐ అనేది మూత్రనాళంలోని ఏదైనా భాగంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్. సకాలంలో చికిత్స చేయకపోతే.. యూటీఐ పేషెంట్ మూత్రపిండాలు దెబ్బతింటాయి. కిడ్నీ పూర్తిగా చెడిపోతే మార్పిడి చేయాల్సి వస్తుంది. అందుకే యూటీఐ నివారణకు తక్షణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ముందుగా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల యూటీఐకి కారణమయ్యే బ్యాక్టీరియా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. వ్యాది ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
యూటీఐని నివారించాలనుకుంటే.. కొన్ని తప్పులు అస్సలు చేయొద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. మూత్రాన్ని ఎక్కువసేపు నిలిపి ఉంచుకోవద్దని చెబుతున్నారు. అలా చేయడం వల్ల మూత్రనాళంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. తడి లోదుస్తులను ధరించవద్దు. మలవిసర్జన తరువాత పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. లైంగిక చర్య తరువాత కూడా మూత్ర విసర్జన చేయాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది.
Also Read:
అన్నింటికంటే ముఖ్యంగా యూటీఐ వ్యాప్తి లక్షణాలను విస్మరించొద్దు. ఈ లక్షణాలు చాలా కాలంపాటు శరీరంలో ఉంటే.. చికిత్స చేయకపోతే మూత్రపిండా క్రమంగా క్షీణించడం ప్రారంభం అవుతుంది. ఇది మరింత ప్రమాదానికి దారి తీస్తుంది. అందుకే అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.
యూరిన్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు..
➥ తరచుగా మూత్ర విసర్జన.
➥ పొత్తి కడుపులో నొప్పి.
➥ మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది.
➥ మూత్రంలో మండుతున్న అనుభూతి.