Share News

Health Tips: ఈ ఆహారాలు తింటున్నారా? బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం పక్కా..!

ABN , Publish Date - Sep 14 , 2024 | 10:38 AM

రోజువారీ ఆహారంలో సాధారణంగా తీసుకునే కొన్ని ఆహారాలు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతాయి.

Health Tips:  ఈ ఆహారాలు తింటున్నారా? బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం పక్కా..!
Bad Cholesterol

కొలెస్ట్రాల్ శరీరానికి చాలా అవసరం. కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉంటాయని తెలిసిందే. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ గుండెను, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచితే.. చెడు కొలెస్ట్రాల్ చాలా రకాల ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ లేని ఆహారం తీసుకోవాలని ఆహార నిపుణులు చెబుతుంటారు. రోజువారీ ఆహారంలో సాధారణంగా తీసుకునే కొన్ని ఆహారాలు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతాయి. అవేంటో తెలుసుకుంటే..

మందంగా, ఒత్తుగా జుట్టును పెంచే సీక్రెట్ ఆయిల్.. దీన్నెలా చేయాలంటే..!


వేయించిన ఆహారాలు..

సమోసాలు, పకోడాలు, వడలు వంటి డీప్ ఫ్రై ఆహారాలు తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వుల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతాయి.

సంతృప్త కొవ్వులు..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి సంతృప్త కొవ్వులు ప్రధాన కారణం అవుతాయి. సంతృప్త కొవ్వులను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె మీద చెడు ప్రభావం పడుతుంది.

ప్రాసెస్ చేసిన మాంసం..

సాసేజ్ లు, హాట్ డాగ్ లు, బేకన్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సంతృప్త కొవ్వులు, సోడియం అధికంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

జుట్టు బాగా రాలుతోందా? అసలు కారణాలు ఇవే..!


బేకరీ ఉత్పత్తులు..

పేస్ట్రీలు, కేకులు, కుకీలు, డోనట్స్, పఫ్,పిజ్జా, బర్గర్ వంటి వాటిలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వులు ఉంటాయి.

ఫుల్ ప్యాట్ మిల్క్..

ఎక్కువగా కొవ్వు ఉన్న పాలు, వెన్న, క్రీమ్ వంటి పాల ఆధారిత ఆహారాలలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి..

డ్రాగన్ ఫ్రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. ఈ నష్టాలు కూడా ఉంటాయి..!

తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే జరిగేది ఇదే..!

హార్మోన్లను బ్యాలెన్స్ గా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 14 , 2024 | 03:59 PM