Share News

Health Tips: మలబద్దకం వేధిస్తోందా? మజ్జిగలో ఈ 2 పదార్థాలు కలిపి తాగితే..!

ABN , Publish Date - Oct 15 , 2024 | 12:10 PM

ఆహారం తిన్నంత ఈజీగా మోషన్ కూడా సాఫీగా జరిగితే ఏ సమస్య ఉండదు. కానీ చాలామందికి మలబద్దకం సమస్య ఉంటుంది. బయటకు వెళ్లాల్సిన మలం శరీరంలోనే ఉండిపోతే అనేక రోగాలు వస్తాయి.

Health Tips: మలబద్దకం వేధిస్తోందా? మజ్జిగలో ఈ 2 పదార్థాలు కలిపి తాగితే..!
Constipation

తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మలబద్దకం వస్తుంది. ప్రతి రోజూ ఆహారం ఎలాగైతే తీసుకుంటామో.. అదే విధంగా తిన్న ఆహారం జీర్ణమై.. ఆహారం తాలుకు వ్యర్థం అంతా మలం రూపంలో బయటకు వెళ్లిపోతేనే శరీరం బాగుంటుంది. సాధారణంగా ఉదయం లేవగానే చాలమందికి మోషన్ అయిపోతుంది. కానీ కొందరికి మాత్రం మలం ప్రేగులలోనే చిక్కుకుపోతుంది. దీని కారణంగా కడుపు భారంగా ఉండటం, ఉబ్బరంగా అనిపించడం, శరీరంలో గ్యాస్ పేరుకుపోవడం జరుగుతుంది. ఇవన్నీ కలిసి ఆహారం తినడంలో కూడా ఇబ్బందిని కలుగజేస్తాయి. అసలు మలబద్దకం ఎందుకు వస్తుంది? దీని వల్ల కలిగే ఇతర సమస్యలేంటి? మజ్జిగతో ఈ సమస్యకు ఈజీగా ఎలా చెక్ పెట్టవచ్చు? తెలుసుకుంటే..

Hair Growth: ఇవి అలవాటు చేసుకుంటే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది..!


మలబద్దకం సమస్యకు ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, జీర్ణ సంబంధ సమస్యలు కారణమవుతాయి. తిన్న ఆహారం సరిగా జీర్ణం కావాలంటే ఆహారంలో ఫైబర్, ద్రవ పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. అవి లేకపోతే తిన్న ఆహారం ప్రేగులలో సరిగా కదలిక లేకుండా స్థిరంగా ఉండిపోతుంది. ద్రవ పదార్థాలు కూడా తగినంత తీసుకోకపోవడం వల్ల మలం చాలా గట్టిగా ఉండిపోతుంది. ఫైబర్, ద్రవ పదార్థాలకు బదులు ఎక్కువగా మైదా, బిస్కెట్లు, రోటీలు, పిండి పదార్థాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బర్గర్లు, పిజ్జా వంటివి ఎక్కువగా తీసుకుంటే మలబద్దకం వచ్చే సమస్య ఎక్కువ. మలబద్దకాన్ని సింపుల్ గా పరిష్కరించాలంటే మజ్జిగలో రెండు పదార్థాలు మిక్స్ చేసి తాగాలట.

జీలకర్ర, వాము..

జీలకర్ర, వాము.. జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. మజ్జిగ ప్రోబయోటిక్ గా పనిచేస్తుంది . ఇది ఆహారాన్ని జీర్ణం చేసే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను అభివృద్ది చేస్తుంది. తద్వారా జీర్ణ సమస్యలు దూరం చేస్తుంది. జీలకర్ర, వామును మజ్జిగలో కలిపి తీసుకుంటే మలబద్దకం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

Health Tips: పైల్స్ తో బాధపడుతున్నారా? ఆయుర్వేదం చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే..!


దీన్నెలా తాగాలంటే..

మలబద్దకం సమస్య పరిష్కారం కావాలంటే జీలకర్ర, వామును మజ్జిగలో కలిపి తాగాలి. జీలకర్ర, వామును విడిగా వేయించి పొడిగా చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ వాము పొడిని గ్లాసుడు మజ్జిగలో కలపాలి. ఈ మజ్జిగలో రుచి కోసం కొద్దిగా నల్ల ఉప్పు కలపాలి. దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం ఆహారం తీసుకునేటప్పుడు తాగాలి.

ఎలా పని చేస్తుందంటే..

మజ్జిగ ప్రోబయోటిక్ గా పని చేస్తుంది. ఇది కడుపులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచుతుంది. కడుపును చల్లబరుస్తుంది. పేగులను ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. పేగులలో చిక్కుకున్న ఆహారం సులువుగా కదిలేలా చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తొలగించడంలో సహాయపడుతుంది. వాములో ఉండే థైమోల్ అనే సమ్మేళనం మలబద్దకాన్ని తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి..

Weight Loss: బరువు తగ్గాలంటే నీరు ఎలా తాగాలి? వైద్యులు చెప్పిన నిజాలివీ..!

Cancer: పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. మహిళలే కాదు పురుషుల్లో కూడా..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 15 , 2024 | 12:10 PM