Share News

Health Tips: తేనెను వాడేవారు అందరూ తెలుసుకోవాల్సిన విషయం.. ఈ ఆహారాలతో అస్సలు కలిపి తినకూడదు..

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:33 PM

తేనె తినే చాలా మందికి ఈ కాంబినేషన్లో తినకూడదని అస్సలు తెలియదు.

Health Tips: తేనెను వాడేవారు అందరూ తెలుసుకోవాల్సిన విషయం.. ఈ ఆహారాలతో అస్సలు కలిపి తినకూడదు..
Honey

తేనెను సంస్కృతంలో మధు అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టు ఇది చాలా మధురంగా ఉంటుంది. తేనెకు ఆయుర్వేదం చాలా పెద్ద పీట వేసింది. ఆయుర్వేద వైద్యంలో చాలా రకాలుగా తేనెను ఉపయోగిస్తారు. ఇందులో పోషకాలు కూడా ఎక్కువే.. ఆహరంలో చక్కెర, బెల్లం వంటి తీపి పదార్థాలకు బదులుగా స్వచ్చమైన తేనెను ఉపయోగిస్తే చాలా మంచిది. అయితే చాలామంది తెలిసి తెలియక తేనెను విరుద్ద ఆహారాలతో కలిపి తీసుకుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల కంటే ఎదురయ్యే నష్టాలే ఎక్కువ. ఇంతకీ తేనెలో ఉండే ఔషద గుణాలు ఏంటో.. దీన్ని ఏ ఆహారాలతో కలిపి తినకూడదో తెలుసుకుంటే..

Psoriasis: మీకు చర్మ సమస్యలున్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే ఆ జబ్బు ఉన్నట్టే..


తేనెలో పోషకాలు..

తేనెలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. నీరు, కాల్షియం, పొటాషియం, విటమిన్ C వంటి ఇతర పోషకాలు ఉంటాయి .

తేనె ప్రయోజనాలు..

  • ముక్కు, గొంతు నుండి అదనపు శ్లేష్మం తొలగించడానికి తేనె సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గును నివారించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

  • తేనె శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపడంలో, శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

  • తేనెలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో, గాయాలు నయం చేయడంలో సహాయపడుతుంది.

  • గట్ ఫ్లోరాను మెరుగుపరచడంలో సహాయపడే ప్రీబయోటిక్ ప్రభావాన్ని కలిగి ఉండటం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తేనె సహాయపడుతుంది.

  • ప్రీ-డయాబెటిక్, డయాబెటిక్ లేదా ఎసిడిటీ, కడుపు మంట వంటి లక్షణాలు ఉన్నవారికి తేనె ఇవ్వకూడదు. అని నిపుణులు అంటున్నారు.

Health Tips: పండుగ ముందు పొట్ట ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే ఈ నీరు తాగండి..


తేనెను వీటితో కలిపి తినకూడదు..

వేడినీరు..

తేనెను చాలా వేడిగా ఉన్న నీటిలో కలిపి తాగితే అది హానికరంగా మారుతుంది. తేనెను 140డిగ్రీల వేడి వద్ద ఉంచితే అది విషంగా మారుతుంది. తేనెను వేడికి గురిచేయడం వల్ల క్యాన్సర్ కారకమైన 5-హైడ్రాక్సీమీథైల్ఫర్‌ఫ్యూరల్ లేదా హెచ్‌ఎమ్‌ఎఫ్‌ని విడుదల చేస్తుంది.

వెల్లుల్లి..

వెల్లుల్లితో తేనెను కలిపి తినకూడదు. ఇది జీర్ణక్రియలో అసౌకర్యం కలిగిస్తుంది. జీర్ణశయాంతర సమస్యలున్న వారికి వాటిని తీవ్రం చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు తేనెతో కలిసినప్పుడు వాటిని ప్రాసెస్ చేయడంలో శరీరం ఇబ్బంది పడుతుంది.

దోసకాయ..

దోసకాయను సహజంగా చాలామంది సలాడ్ గా తీసుకోవడానికి ఇష్టపడతారు. దోసకాయ సలాడ్ మరింత రుచిగా ఉండటం కోసం లేదా దోసకాయతో చేసిన జ్యూస్ రుచి పెంచడం కోసం అందులో తేనెను పొరపాటున కూడా కలపకూడదు. దోసకాయతో తేనెను కలపడం వల్ల చర్మ సమస్యలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

Diabetes: జస్ట్.. రోజూ ఒక్క గ్లాస్ దీన్ని తాగారంటే చాలు.. దెబ్బకు షుగర్ సమస్య తోక ముడుస్తుంది..


నెయ్యి..

నెయ్యి, తేనె రెండూ ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలుగా పనిచేస్తాయి. కానీ ఈ రెండింటిని కలిపి తినడం వల్ల పుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. తేనె, నెయ్యి కలిపి తీసుకుంటే జుట్టు రాలడం, బరువు తగ్గడం, చెవులపై ఎర్రటి మచ్చలు రావడం వంటి సమస్యలు కూడా వస్తాయట.

మాంసం లేదా చేపలు..

మాంసకృత్తులు అధికంగా ఉండే చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాలను తేనెతో కలిపి తీసుకోకూడదు. ఇది వింత రుచిని క్రియేట్ చెయ్యడమే కాకుండా జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. పొట్ట సమస్యలు పెంచుతుంది.

తీపి పండ్లు..

పండ్లు సహజంగానే తీపిగా ఉంటాయి. మామిడి, సపోటా, పైనాపిల్ వంటి తీపి పండ్లతో తేనెను జోడించకూడదు. ఇది అధిక బరువుకు, కేలరీలు శరీరంలో అధికంగా చేరడానికి దారితీస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి షుగర్ స్పైక్ లను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి..

జీలకర్రను ఇలా వాడితే శరీరంలో కొవ్వు కరిగిపోద్ది..

ఈ లక్షణాలు కనిపిస్తే.. బోలు ఎముకల వ్యాధి మొదలైనట్టే..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 30 , 2024 | 05:34 PM