Share News

Health Tips: 5 జామ ఆకులతో ఇంత మ్యాజిక్కా.. వీటిని ఎలా వాడాలంటే..

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:22 PM

అందరికీ జామ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు.. కానీ జామ 5 జామ ఆకులతో ఇంత మ్యాజిక్ జరుగుతుందని తెలుసుండదు.

Health Tips: 5 జామ ఆకులతో ఇంత మ్యాజిక్కా.. వీటిని ఎలా వాడాలంటే..
Guava Leaves

జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. పోషకాలలోనూ ఇవి యాపిల్ పండుకు ఏమీ తీసిపోవు. అందుకే జామ పండ్లను పేదవాడి యాపిల్ అంటారు. రోజుకు ఒక జామ పండు తింటూ ఉంటే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చ. జామ పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అయితే జామ పండ్లు మాత్రమే కాదు.. జామ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా బాగా పని చేస్తాయట. రోజుకు 5 జామ ఆకులు వాడుతుంటే ఆరోగ్యానికి అద్భుతం చేస్తాయట. ఇంతకీ జామ ఆకులను ఎలా వాడాలి? ఎలా వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే..

Cholesterol: ఆయుర్వేదం చెప్పిన చిట్కా.. ఈ పానీయాన్ని తాగితే చాలు.. కొలెస్ట్రాల్ దానంతట అదే తగ్గిపోతుంది..


జామ ఆకు కిళ్ళీ.. చిన్న తనంలో చాలా మంది తినే ఉంటారు. కాసింత ఉప్పు, జీలకర్ర, చింతపండును ఒక చిన్న గోళీ లాగా చేసి దాన్ని జామ ఆకులో పెట్టుకుని కిళ్లీ లాగా చుట్టుకుని తింటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది కూడా. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే.. జామ ఆకులను ఆహారంగా వినియోగించడం ఇప్పుడు కొత్తగా పుట్టిందేమీ కాదు.. ఎప్పటినుండో జామ ఆకులను కూడా ఆహారంలో, ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.

రోజుకు 5 జామ ఆకులను వినియోగిస్తే ఆరోగ్య పరంగా మ్యాజిక్ ఫలితాలు ఉంటాయి. గ్రీన్ టీ కంటే ఎక్కువ శక్తివంతంగా జామ ఆకులతో తయారు చేసే టీ పనిచేస్తుంది. జామ ఆకుల టీ ఎలా తయారు చేయాలంటే..

Hair Growth Gummies: మార్కెట్లో ట్రెండ్ అవుతున్న హెయిర్ గ్రోత్ గమ్మీస్.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారుచేసుకోండి..


జామ ఆకుల టీ తయారీ కోసం.. 5 జామ ఆకులు అవసరం. తాజాగా ఉండాల్సిన అవసరం లేదు.. ఇవి ఎక్కువగా దొరికినప్పుడు వీటిని నీడలో ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు.

ఒక గిన్నెలో నీరు పోసి స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. నీరు బాగా మరిగిన తర్వాత స్టౌ ఆప్ చేయాలి. అందులో ఎండిన జామ ఆకులను వేసి గిన్నె మీద మూత పెట్టాలి. సుమారు 5 నుండి 10 నిమిషాలలో జామ ఆకులలో ఉండే సారం అంతా నీటిలోకి వస్తుంది. తరువాత దీన్ని ఫిల్టర్ చేసి వేడివేడిగా తాగాలి. ఈ టీ రుచిగా కావాలి అంటే ఇందులో కాసింత నిమ్మరసం, తేనె కలుపుకోవచ్చు. అంతే చాలా ఈజీగా గ్రీన్ టీ కంటే శక్తివంతమైన జామ ఆకుల టీ రెఢీ అయినట్టే..

Guava: చలికాలంలో జామపండ్లు తినాలని చెప్పేది ఇందుకే.. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..


ప్రయోజనాలు..

  • జామ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే పైబర్ వీటిలో ఉంటుంది. జామ ఆకుల టీ తీసుకుంటే మలం మృదువుగా మారి సాఫీగా మోషన్ అయిపోతుంది. మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది.

  • డయాబెటిస్ ఉన్నవారు లేదా రక్తంలో చక్కెర స్థాయిలతో ఇబ్బంది పడే వారు జామ ఆకుల టీని తీసుకుంటూ ఉంటే రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంటుంది. ఆహారం తీసుకున్న తరువాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం తగ్గడం వంటివి జరగవు.

  • రోగనిరోధక శక్తి బలంగా ఉండాలన్నా సీజనల్ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా జామ ఆకుల టీ బాగా సహాయపడుతుంది. జామ ఆకుల టీలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జామ ఆకుల టీలో నిమ్మకాయ రసం కలిపితే మరింత ఎక్కువ ప్రయోజనకరం.

  • నేటికాలంలో క్యాన్సర్ వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జామ ఆకుల టీ తాగడం చాలా మంచిది. జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను నివారించడంలో సహాయపడతాయి. జామ ఆకులలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి..

Calcium: పాల కంటే 8రెట్ల కాల్షియం ఉన్న గింజలు.. రోజూ ఓ స్పూన్ తింటే ఎముకలు ఉక్కులా మారడం ఖాయం..

కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 13 , 2024 | 04:22 PM