Share News

Belly Fat: మీ పొట్ట కొవ్వును ఇలా కరిగించుకోండి..

ABN , Publish Date - Nov 17 , 2024 | 04:07 PM

తినే ఆహారం, జీవన విధానం మీ పొట్టను మరింత లావుగా మారుస్తుంది. పొట్ట కొవ్వు తగ్గాలంటే ఏ పానియం తీసుకుంటే మంచిది? ఎలా తయారు చేస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం..

Belly Fat: మీ పొట్ట కొవ్వును ఇలా కరిగించుకోండి..
Belly fat

సబ్జా గింజలు: మన జీవన విధానం వల్ల చాలా సమస్యలు మన శరీరాన్ని ఇబ్బంది పెడుతాయి. వాటిలో ఒకటి పొట్ట కొవ్వు. తినే ఆహారం, జీవన విధానం మీ పొట్టను మరింత లావుగా మారుస్తుంది. మనం ప్రతిరోజూ పానీయాలు తీసుకోవడం మామూలే. అయితే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పానియాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మన పొట్ట కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఈ పానియాలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాదు తక్కువ ఖర్చుతో అత్యధిక ప్రయోజనాలను అందించే పానియం.


ఖాళీ కడుపుతో తాగండి..

ఒక గ్లాసులో వేడి నీళ్ళు తీసుకుని అందులో సబ్జా గింజలు వేసిన తర్వాత తేనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని అరగంట సేపు నాననివ్వండి. ఇలా తయారు చేసిన నీటిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. తద్వారా మీ పొట్టలోని కొవ్వు త్వరగా కరిగిపోతుంది. ఈ పానియాను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీరు చాలా త్వరగా మంచి ఫలితాలను చూస్తారు.


ఇష్టమైన ఫ్రూట్ జ్యూస్ తో..

ఈ డ్రింక్ ను స్ట్రెయిట్ గా తాగలేకపోతే మీకు ఇష్టమైన ఫ్రూట్ జ్యూస్ తో మిక్స్ చేసుకోవచ్చు. అయితే, మీరు ఏ పండ్ల రసం తాగినా అందులో చక్కెర కలిపి ఉండకూడదు. జ్యూస్ మాత్రమే కాదు, ఈ సబ్జా గింజల రసాన్ని స్మూతీలో కలిపి కూడా తాగవచ్చు. ఇందులో ఉండే పదార్థాలన్నీ ఆరోగ్యానికి ఎంతోో మేలు చేస్తాయి. ఈ పానియాను గోరువెచ్చగా తాగితేనే ఈ ఫలితం లభిస్తుంది. కేవలం పానీయం తాగితే కడుపు తగ్గదు. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఖచ్చితంగా అనుసరించాలి. పొట్ట కొవ్వు తగ్గాలంటే వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా ముఖ్యం.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)


Also Read:

రాత్రి పూట ఈ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు..

ఎక్కువ సేపు కూర్చుంటున్నారా.. ఈ ప్రమాదాలు తప్పవు..

రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..

For More Health News

Updated Date - Nov 17 , 2024 | 04:11 PM