Share News

Health Tips: ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు.. జలుబు, దగ్గు నుండి ఎంత వేగంగా కోలుకుంటారంటే..!

ABN , Publish Date - Sep 27 , 2024 | 01:58 PM

దగ్గు, జలుబు సమస్య వస్తే చాలారోజులు వేధిస్తాయి. వీటినుండి వేగంగా కోలుకోవాలంటే ఈ డ్రింక్ భలే సహాయపడుతుంది.

Health Tips: ఈ ఒక్క డ్రింక్ తాగండి చాలు..  జలుబు, దగ్గు నుండి ఎంత  వేగంగా కోలుకుంటారంటే..!
Cough-cold remedy

జలుబు, దగ్గు వాతావరణంలో మార్పులు వచ్చిన ప్రతిసారి చాలామందిని వేధించే సమస్యలు. ఇవి వచ్చినంత సులువుగా నయం కావు. కనీసం వారం రోజులు అయినా వేధిస్తుంటాయి. కానీ ఈ రెండు సమస్యలు తలనొప్పి, తలభారం, జ్వరం వంటి సమస్యలకు కూడా కారణం అవుతాయి. వీటి నుండి ఉపశమనం కోసం చాలా రకాల మెడిసిన్ వాడతారు కానీ ఆశించినంత మార్పు అంత త్వరగా ఉండదు. ముఖ్యంగా జలుబు, దగ్గు కారణంగా గొంతులో, ఛాతీలో శ్లేష్మం కూడా పేరుకుపోతుంటుంది. వీటి నుండి ఉపశమనం పొందాలంటే కేవలం ఒక్క డ్రింక్ తాగితే చాలు. ఇంట్లోనే ఆయుర్వేదం సూచించిన దినుసులతో ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలంటే..

బంగారం లాంటి గ్లో కావాలంటే.. పసుపుతో చేసిన ఈ సీరమ్ వాడండి..!


వాము ఆకు, బెల్లం డ్రింక్..

వాము ఆకులు దగ్గుకు గొప్ప ఔషదంగా పరిగణిస్తారు. కొన్ని వాము ఆకులను తీసుకుని సన్నగా కట్ చేసి ఒక కప్పు నీటిలో వేయాలి. ఇందులోనే కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇది రుచిని మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. నీరు బాగా ఉడికిన తరువాత స్టౌ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. దీన్ని వేడిగా తాగితే అప్పటికే దగ్గు కారణంగా చికాకు పడిన గొంతు మరింత మంట పెడుతుంది. అందుకే గోరు వెచ్చగా ఉన్నప్పుడు దీన్ని తాగాలి. దీన్ని రోజులో ఒక్క సారి తాగితే చాలు.. జలుబు, దగ్గు మంత్రించినట్టు మాయమవుతాయి. ఈ మిశ్రమం దగ్గు, జలుబు ఉన్నప్పుడే కాకుండా మహిళలు నెలసరి సమయంలో కూడా తాగచ్చు. ఇది నెలసరి నొప్పులు, తిమ్మిర్లు, అసౌకర్యం నుండి ఉపశమనం అందిస్తుంది.

ఈ సమస్యలు ఉన్నవారు బాదం తింటే డేంజర్..!


వాము ఆకు, బెల్లం డ్రింక్ తాగితే కలిగి మరికొన్ని ప్రయోజనాలు..

జలుబు, కఫం..

వాము ఆకులు, బెల్లం వేడి చేసే గుణం కలిగి ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు చికిత్సలో ప్రభావవంతంగా ఉంటాయి. ఛాతీలో కఫం ఇరుక్కుని బాధపడుతున్నవారు ఈ డ్రింక్ తాగితే కఫం బయటకు వచ్చేస్తుంది. ఛాతీ రిలీఫ్ అవుతుంది. చలికాలంలో ఈ డ్రింక్ చాలా మంచి ఉపశమనం ఇస్తుంది.

కడుపునొప్పి..

ఆయుర్వేదంలో వాము, బెల్లం కలిపి ఉడికించిన నీరు కడుపునొప్పికి దివ్యౌషధంగా పరిగణిస్తారు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న మహిళలకు వాము, బెల్లం కలిపి తయారుచేసిన డ్రింక్ చాలా అద్భుతంగా తయారుచేస్తుంది. ముఖ్యంగా నెలసరి తిమ్మిర్లు బాగా తగ్గుతాయి.

ఈ ఒక్క డైట్ ప్లాన్ ఫాలో అయితే.. ఈజీగా బరువు తగ్గవచ్చు..!


వెన్నునొప్పి..

కొన్నిసార్లు జలుబు లేదా ఇతర కారణాల వల్ల విపరీతమైన వెన్నునొప్పి వస్తుంది. అలాంటి సమయంలో వాము, బెల్లం కలిపి ఉడికించిన నీరు బాగా సహాయపడుతుంది. వెన్ను నొప్పి తగ్గిస్తుంది.

ఫైల్స్..

బెల్లం, వాము రెండూ కలిపి తయారుచేసిన డ్రింక్ తాగుతుంటే ఫైల్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. మలవిసర్జన సజావుగా సాగడంలో ఈ డ్రింక్ సహాయపడుతుంది. దీన్ని రోజులో 2 నుండి 3 సార్లు తాగాలి.

ఇవి కూడా చదవండి..

ఇష్టపడే రంగును బట్టి మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 27 , 2024 | 01:58 PM