Share News

Health Tips: 60 ఏళ్ల వయసులోనూ 25ఏళ్లలా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ డ్రింక్స్ తాగండి చాలు..

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:25 PM

60 ఏళ్ల వయసు వచ్చేసరికి చాలామంది మందుల మీద ఆధారపడుతూ చాలా రకాల ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతుంటారు. కానీ ఈ జ్యూసులు తాగితే మాత్రం యంగ్ గా ఉత్సాహంగా ఉంటారు.

Health Tips: 60 ఏళ్ల వయసులోనూ 25ఏళ్లలా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ డ్రింక్స్ తాగండి చాలు..

వయసు కేవలం నెంబర్ మాత్రమే అంటారు చాలామంది. కానీ వయసు పెరిగే కొద్ది శరీరంలో జరిగే మార్పులు, శరీరంలో పట్టు తగ్గడం జరుగుతాయి. మరీ ముఖ్యంగా పనులు చేయడంలో ఉత్సాహం చాలా తగ్గుతుంది. చాలామంది మందుల మీద ఆధారపడతారు. కానీ 5 రకాల డ్రింక్స్ తాగుతుంటే చాలు.. 60 ఏళ్ల వయసొచ్చినా పాతికేళ్ల యువతలా ఉత్సాహంగా ఉండొచ్చట. ఇంతకీ అవేంటో.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుంటే..

పూజ కోసం వాడిన పువ్వులను ఇలా ఉపయోగిస్తారని మీకు తెలుసా..


బీట్ రూట్ జ్యూస్..

బీట్ రూట్ జ్యూస్ చాలా శక్తివంతమైనది. బీట్ రూట్ జ్యూస్ తాగితే స్టామినా పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. దీంతో రక్తపోటు సమస్య కూడా దూరమపుతుంది. బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే శరీరంలో వాపులు తగ్గుతాయి. కాలేయ ఆరోగ్యం బలంగా మారుతుంది.

చెర్రీ జ్యూస్..

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండే చెర్రీ పండ్ల జ్యూస్ తాగితే స్టామినా పెరుగుతుంది. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. చెర్రీ జ్యూస్ లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫైబర్ తో పాటు విటమిన్-ఎ, విటమిన్-సి శరీరానికి శక్తిని ఇస్తాయి.

అవకాడో జ్యూస్..

అవకాడో శరీరానికి అమితమైన శక్తిని ఇస్తుంది. ఇందులో విటమిన్-సి, విటమిన్-ఇ, విటమిన్-కె వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అవకాడో జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరం త్వరగా అలసిపోకుండా ఎక్కువసేపు ఉత్సాహంగా ఉంటుంది.

ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి..!


దానిమ్మ జ్యూస్..

దానిమ్మ జ్యూస్ కూడా శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-ఇ, విటమిన్-కె, మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటు పెరగకుండా చేస్తాయి.

కొబ్బరి నీరు..

భూమి మీద లభించే అత్యంత సహజ పానీయాలలో కొబ్బరి నీరు ఉత్తమమైనది. కొబ్బరి నీరు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో కొబ్బరి నీరు బాగా సహాయపడతాయి. కండరాలను బలపరుస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి నీరు తాగితే రోజంతా చురుగ్గా ఉండవచ్చు. రోజూ కొబ్బరి నీరు తాగుతుంటే ఎంత వయసు పెరిగినా ఉత్సాహంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి..

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?

ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 20 , 2024 | 12:25 PM