Health Tips: వంటల్లో పచ్చ కర్పూరం ఎందుకు జోడిస్తారు? ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదంటే..
ABN , Publish Date - Nov 11 , 2024 | 10:33 AM
పచ్చ కర్పూరాన్ని దేవుడి కార్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది చాలా ఘాటుగా, ఆహ్లాదకరమైన సువాసన కలిగి ఉంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి ఎంత వరకు మేలంటే..
కర్పూరం గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. కర్పూరంలో వివిధ రకాలు ఉన్నాయి. వాటిలో సాధారణ కర్పూరం, ముద్ద కర్పూరంతో పాటు పచ్చ కర్పూపం కూడా ఉంటుంది. పచ్చ కర్పూరాన్ని దైవ పూజలలోనూ, ప్రసాదాలలోనూ ఎక్కువగా వాడతారు. గుడిలో తీర్థం, ప్రసాదంలో తప్పకుండా పచ్చకర్పూరం కలిపి ఉంటారు. కొందరు ఇళ్లలో చేసే వంటల్లోనూ, దేవుడికి నివేదించాల్సిన ప్రసాదాలలోనూ కర్పూరాన్ని వాడటం చూస్తుంటాం. అసలు పచ్చ కర్పూరాన్ని ఎందుకు వాడతారు? ఇది ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తుంది? తెలుసుకుంటే..
పిల్లలలో కాన్ఫిడెంట్ పెరగాలంటే.. తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులు ఇవీ..
కర్పూరం..
కర్పూరం ఆగ్నేయాసియా ప్రాంతంలో కర్పూర చెట్ల నుండి తయారవతుంది. దీన్ని కృత్రిమంగా కూడా ఉత్పత్తి చేస్తారు. దీని వాసన చాలా బలంగా, ఆహ్లాదంగా కూడా ఉంటుంది. కర్పూరాన్ని ఔషదాల తయారీలోనూ, సౌందర్య ఉత్పత్తులలోనూ వినియోగిస్తారు. ఇక పచ్చకర్పూరాన్ని వంటలలోనూ వాడతారు. కర్పూరం గది ఉష్టోగ్రత వద్ద కరుగుతుంది. అది వాయు రూపంలోకి మారుతుంది.
ప్రయోజనాలు..
కర్పూరం ఆహారానికి ప్రత్యేక రుచిని ఇస్తుంది. చల్లదనాన్ని, సువాసనను కలిగి ఉంటుంది. దీన్ని తీపి పదార్థాల తయారీలో వాడినప్పుడు తీపి రుచిని మరింత పెంచుతుంది. ఆహారాన్ని ఎక్కువకాలం తాజాగా ఉంచుతుంది.
కర్పూరాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని నమ్ముతారు. పండుగ సందర్భాలలో, దేవుడి ఉత్సవాలు, నైవేద్యాలలో పచ్చ కర్పూరాన్ని వాడతారు. పచ్చ కర్పూరం ఉపయోగించిన ప్రదేశం చాలా ప్రశాంతంగా, మనసుకు హాయిని ఇస్తుంది.
ఆరోగ్య పరంగా పచ్చ కర్పూరం చాలా గొప్ప లక్షణాలు కలిగి ఉంటుంది. భారీ భోజనం తీసుకున్నప్పుడు, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు పచ్చ కర్పూరం వాడితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆహారం బాగా జీర్ణం కావడంలో ఇది బాగా సహాయపడుతుంది.
మీకు సీతాఫలం అంటే ఇష్టమా.. ఈ నిజాలు తెలిస్తే..
ఎంత వరకు ఆరోగ్యం..
కర్పూరం వివిధ మార్గాలలో ఉపయోగించినా దీన్ని ఆహారంలో తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వంటల్లో పచ్చకర్పూరాన్ని చాలా కొద్ది మొత్తంలో ఉపయోగించాలి. ఎక్కువ మొత్తం ఉపయోగిస్తే ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది.
చిటికెడు కర్పూరం లేదా వంట పరిమాణాన్ని బట్టి ఒక చిన్న ముక్క పచ్చ కర్పూరం వేస్తే సరిపోతుంది. అంతకు మించి వాడకూడదు. ఒక వేళ వాడితే అది శరీరానికి విషంలా పని చేస్తుందని అంటున్నారు. పచ్చ కర్పూరం వల్ల శరీరంలో పాయిజన్ ఏర్పడితే వికారం, వాంతులు, మైకం, మూర్చలు, కొన్ని ప్రమాదకర పరిస్థితులలో మరణం వరకు వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి.
కర్పూరాన్ని ఉపయోగించేటప్పుడు మన్నికగా ఉన్నది ఎంచుకోవాలి. ఔషదాల తయారీ కోసం, సౌందర్య సాధనాల కోసం ఉపయోగించే కర్పూరాన్ని వంటల కోసం ఎట్టి పరిస్థితులలో ఎంచుకోకూడదు.
ఇవి కూడా చదవండి..
ఈ డ్రింక్స్ తాగితే.. ఈజీగా బరువు తగ్గుతారు..
వామ్మో.. ఈ పండ్లు తినకండి బాబూ.. బరువు పెరుగుతారు..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.