Health Tips: గోరు వెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగితే కలిగే లాభాలు తెలుసా?
ABN , Publish Date - Sep 12 , 2024 | 07:45 PM
ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో దేశవాళీ ఆవు నెయ్యిని ఒక స్పూన్ కలుపుని తాగడం వల్ల..
ఉదయాన్ని గోరు వెచ్చని నీటితో ప్రారంభించే వారు చాలామంది ఉన్నారు. మరికొందరు ఉదయాన్నే నిమ్మరసం నీరు, తేనె, గ్రీన్ టీ, జీలకర్ర నీరు వంటి పానీయాలతో మొదలు పెడుతుంటారు. ఉదయాన్నే ఇలాంటి పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు తొలగిపోవడమే కాకుండా ప్రేగులు శుభ్రపడతాయి. మలబద్దకం, జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అయితే ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో దేశవాళీ ఆవు నెయ్యిని ఒక స్పూన్ కలుపుని తాగడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
పియర్ పండ్లు తింటే.. ఈ సమస్యలన్నీ నయమవుతాయట..!
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇది ఫ్రాక్చర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ మూత్రం, మలం సహాయంతో బయటకు రావడంలో ఇది సహాయపడుతుంది.
గోరు వెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగుతూ ఉంటే చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. మెరిసే చర్మం సొంతమవుతుంది.
వాడిపోయిన, పొడిబారిన చర్మం కలవారు ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగుతుంటే చర్మం మృదువుగా ఉంటుంది.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు నెయ్యి కలిపిన గోరువెచ్చని నీరు తాగితే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
మందంగా, ఒత్తుగా జుట్టును పెంచే సీక్రెట్ ఆయిల్.. దీన్నెలా చేయాలంటే..!
గోరు వెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే జీవక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.
నెయ్యిని వేడి నీటిలో కలిపి తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది. శరీరంలో మలినాలు, వ్యర్థాలు, విషపదార్థాలు తొలగిపోతాయి.
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు.
మధుమేహం ఉన్నవారు గోరు వెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగితే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే జరిగేది ఇదే..!
ఈ 7 తప్పులు చేస్తే తొందరగా ముసలి వాళ్ళు అవుతారు.. !
రాత్రి సమయంలో చేసే ఈ తప్పుల వల్ల ఈజీగా బరువు పెరుగుతారు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.