Share News

Health Tips: అరటిపండును పాలతో తినడం ఇష్టమా.. ఇదెంత చెడ్డ అలవాటంటే..

ABN , Publish Date - Oct 18 , 2024 | 06:25 PM

అరటిపండు, పాలు కలిపి తినడం చాలా మంది అలవాటు. కానీ ఈ రెండు కలిపి తింటే జరిగేదిదే..

Health Tips: అరటిపండును పాలతో తినడం ఇష్టమా.. ఇదెంత చెడ్డ అలవాటంటే..

అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. పేద వారి నుండి ధనవంతుల వరకు ఎవరైనా దీన్ని కొనగలరు. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ఎవరైనా దీన్ని తినగలరు. సులభంగా జీర్ణం కావడం వల్ల అనారోగ్యం ఉన్నవారు కూడా అరటిపండు తినే విషయంలో భయపడరు. అరటి పండు లాగే పాలు కూడా అందరూ తినగలరు. పైగా పాలు మంచి ప్రోటీన్ పానీయం కూడా. కానీ అరటిపండ్లను చాలా మంది తప్పుగా తీసుకుంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలు, అరటిపండును కలిపి తీసుకుంటారు. ఈ రెండింటి కాంబినేషన్ లో మిల్క్ షేక్ నుండి చాలా రకాల పదార్థాలు తయారు చేస్తారు. కానీ అరటిపండును పాలతో కలిపి తినడం వల్ల ఆరోగ్యం చెప్పలేనన్ని నష్టాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు ఆహార నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

Health Tips: మల్బరీ పండ్లు ఎప్పుడైనా తిన్నారా.. వీటితో ఎన్ని లాభాలంటే..


  • పాలు, అరటిపండు కలిపి తీసుకుంటే జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. దీని వల్ల కడుపులో భారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. అందుకే పాలు, అరటిపండు కలిపి తీసుకోకూడదు.

  • ఆయుర్వేదం ప్రకారం పాలు, అరటిపండు కలిపి తీసుకుంటే శరీరంలో విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయట. పైగా ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కఫం, అలర్జీ, జలుబు వంటి సమస్యలు కూడా వస్తాయట.

  • అరటిపండు ఒకటే తిన్నా ఆరోగ్యం, పాలు తాగినా ఆరోగ్యం. కానీ ఈ రెండూ కలిపితే రెండింటిలో కేలరీలు కలసి శరీరానికి ఎక్కువ కేలరీలు సరఫరా చేస్తాయి. ఈ కారణంగా పాలు, అరటిపండు తినేవారు ఈజీగా బరువు పెరుగుతారు.

Korean Skin: రోజూ ఈ 3 టిప్స్ పాటిస్తుంటే చాలు కొరియన్ గ్లాస్ స్కిన్ మీ సొంతం..!

.


  • పాలు, అరటిపండు కలిపి తింటే శరీరంలో శ్లేష్మం పెరుగుతుందట. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పటికే కఫం సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ కాంబినేషన్ కు దూరం ఉండాలి.

  • కొందరికి పాలు, అరటిపండు కలిపి తింటే అలర్జీ రావచ్చు. ఇది చర్మం పై దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలు వంటి సమస్యలు సృష్టిస్తుంది.

  • పాలు, అరటిపండు కలిపి తింటే శరీరంలో అలసట చోటు చేసుకుంటుంది. ఇవి శరీరంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. ఈ కారణంగా శరీరం బద్దకానికి లోనవుతుంది

ఇవి కూడా చదవండి..

పూజ కోసం వాడిన పువ్వులను ఇలా ఉపయోగిస్తారని మీకు తెలుసా..

ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 18 , 2024 | 06:25 PM