Health Tips: చాలా వేడిగా ఉన్న ఆహారం తింటున్నారా? ఈ నిజాలు తెలుసా?
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:30 PM
కొందరికి మాత్రం చాలా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవడం అలవాటు. కాఫీ, టీ, టిఫిన్, భోజనం.. ఏదైనా సరే.. పొగలు కక్కుతూ వేడివేడిగా ఉండాలని అంటుంటారు. వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకుంటూ ఉంటారు.
శరీరానికి ఆహారమే శక్తి వనరు. ఆహారం ఎప్పుడూ తాజాగా, వేడిగా తీసుకోమని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. అయితే కొందరికి మాత్రం చాలా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవడం అలవాటు. కాఫీ, టీ, టిఫిన్, భోజనం.. ఏదైనా సరే.. పొగలు కక్కుతూ వేడివేడిగా ఉండాలని అంటుంటారు. వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా వేడివేడిగా ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతవరకు ఆరోగ్యం? వేడివేడిగా ఉన్న ఆహారం తీసుకుంటే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసుకుంటే..
కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా?
గొంతు చికాకు..
చాలా వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకవడం వల్ల నోరు, గొంతులో మంట ఏర్పడుతుంది. ఇది గొంతు నొప్పి, అసౌకర్యానికి కారణం అవుతుంది.
జీర్ణక్రియ..
చాలా వేడిగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల కడుపు, ప్రేగుల పై చాలా ప్రభావం పడుతుంది. జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. జీర్ణక్రియ మందగిస్తుంది.
అన్న వాహిక క్యాన్సర్..
కొన్ని అధ్యయనాల ప్రకారం చాలా వేడిగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల అన్నవాహికలో చికాకు ఏర్పడుతుంది. ఇది అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువకాలం చాలా వేడిగా ఉన్న ఆహారాన్ని తినడం కొనసాగిస్తే.. అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
తక్కువగా నిద్రపోతే చర్మం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?
నాలుక..
చాలా వేడిగా ఉన్న ఆహారాన్ని తింటే నాలుక, రుచి మొగ్గలు దెబ్బ తింటాయి. వేడిగా ఉన్న ఆహారం తిన్నప్పుడు బానే ఉంటుంది. కానీ ఆ తరువాత క్రమంగా రుచి మొగ్గల పనితీరు మందగిస్తుంది. ఏ ఆహారం తీసుకున్నా వాటి రుచిని నాలుక గ్రహించలేదు.
రుచి..
చాలా వేడిగా ఉన్న ఆహారం తినేటప్పుడు దాని రుచిని ఆస్వాదించలేము. వేడిగా ఉన్న ఆహారాన్ని ఇష్టపడేవారు అది ఎక్కడ చల్లారిపోతుందో అని చాలా తొందరగా తింటారు. ఇది ఆహారపు రుచిని దెబ్బతీస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఈ ఆహారాలు తీసుకోండి.. అధిక కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది..!
పియర్ పండ్లు తింటే.. ఈ సమస్యలన్నీ నయమవుతాయట..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.