Share News

Health Tips: సూజీ, రవ్వకు తేడా ఏంటి? ఏది ఎక్కువ ఆరోగ్యమంటే..!

ABN , Publish Date - Sep 20 , 2024 | 01:40 PM

చాలా మంది అల్వాహారం కోసం రవ్వను, సూజీని ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యం?

Health Tips: సూజీ,  రవ్వకు తేడా ఏంటి? ఏది ఎక్కువ ఆరోగ్యమంటే..!

అన్నం తరువాత భారతీయులు ఎక్కువ తినే ఆహారాలలో చపాతీ.. దాని తరువాత సింపుల్ గా అయిపోయే ఉప్మా ముందుు వరుసలో ఉంటాయి. ఉప్మాను బ్యాచ్లర్ కుర్రవాళ్లు కూడా ఈజీగా వండేసుకుని తింటుంటారు. అత్యవసరంగా టిఫిన్ చెయ్యాల్సి వచ్చినా, సమయం ఎక్కువ లేకపోయినా ఉప్మానే ఎక్కువ మంది ఛాయిస్. అయితే ఉప్మా తయారు చేయడానికి చాలామంది రెండు రకాల రవ్వలు ఉపయోగిస్తారు. ఒకటి సూజీ, మరొకటి రవ్వ. రెండు రవ్వలతో వండే వంటలు చాలా రుచిగా ఉంటాయి. చాలామందికి వీటి మధ్య తేడా అంతగా తెలియదు. రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యమో తెలుసుకుంటే..

Botox: బొటాక్స్ అంటే ఏంటి? ఇది చర్మాన్ని యవ్వనంగా ఎలా మారుస్తుందంటే..!


చాలామంది వంటల్లో రవ్వను ఉపయోగిస్తారు. వీటిలో సూజీ, రవ్వ అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండింటిని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. వీటిలో రవ్వను ఉప్మా, రవ్వ దోశ, రవ్వ ఇడ్లీ, కొన్ని రకాల స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. అదే విధంగా సూజీతో కిచిడి, ఉప్మా వంటి ఆహారాలు వండుకుంటారు. ఈ రెండు రవ్వలను దురుమ్ గోధుమల తోనే తయారు చేస్తారు.

సూజీ..

సూజీ తో అనేక రకాల స్నాక్స్ నుండి తీపి వంటకాల వరకు చాలా తయారు చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన అల్పాహారంలో సూజీని ఎక్కువగా ఉపయోగిస్తారు.

రవ్వ..

సూజీని ఇష్టపడే వారు అధికమే అయినా రవ్వకు కూడా ఫ్యాన్స్ ఎక్కువే ఉన్నారు. రవ్వతో ఉప్మా, రవ్వ డోక్లా, రవ్వ లడ్డు, రవ్వ కచోరీ, రవ్వ ఇడ్లీ, రవ్వ దోస మొదలైనవి తయారు చేస్తారు.

ఇష్టపడే రంగును బట్టి మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?


పోషకాలు..

సూజీలోనూ, రవ్వలోనూ పోషకాలు మెరుగ్గా ఉంటాయి. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, సోడియం, ప్రోటీన్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కండరాలను దృఢంగా ఉంచుతాయి. సూజీలో విటమిన్-బి3 ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. సూజీని అయినా, రవ్వను అయినా అల్పాహారంలో తీసుకుంటే రోజంగా శక్తితో ఉండవచ్చు. అలసట, బలహీనత సమస్యలు దూరం అవుతాయి.

తక్కువగా నిద్రపోతే చర్మం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?


ఏది మేలు..

సూజీ బరకగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. దీనికి కూరగాయలను ఎక్కువ మొత్తం జోడించి వండుకుని తినడం వల్ల మంచి డైటింగ్ ఫుడ్ లాగా సహాయపడుతుంది. ఇది వండటానికి నూనె కూడా కాస్త తక్కువే అవసరం.

రవ్వ నునుపుగా ఉంటుంది. ఇది తొందరగా జీర్ణం అవుతుంది. కానీ ఇందులో కార్బోహేడ్రేట్లు సూజీ తో పోలిస్తే తక్కువే. ఇది తొందరగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచిది. దీని తయారీకి కొంచెం నూనె అదనంగా అవసరం అవుతుంది. తీపి పదార్థాల తయారీ కోసం అయితే మైదా, మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ ఫుడ్స్ కంటే రవ్వతో చేసేవి ఆరోగ్యం.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..!

రోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే ఈ సమస్యలు ఉన్నవారికి భలే లాభాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 20 , 2024 | 01:51 PM