Healthy Chapati: పిండిలో ఈ 3 పదార్థాలు కలిపి చపాతీలు చెయ్యండి.. ఎంత ఆరోగ్యమంటే..!
ABN , Publish Date - Jul 11 , 2024 | 12:53 PM
భారతీయులు అన్నం తరువాత అధికంగా తినే ఆహారాలలో చపాతీ ముఖ్యమైనది. చాలా ఇళ్లలో రాత్రిపూట టిఫెన్ స్థానంలో చపాతీ ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార జీవనశైలి పాటించేవారు, డైటింగ్ చేసేవారు చపాతీని ఎన్నుకుంటారు. అయితే చపాతీలు మరింత ఆరోగ్యాన్ని, పోషకాలను ఇవ్వాలంటే..
భారతీయులు అన్నం తరువాత అధికంగా తినే ఆహారాలలో చపాతీ ముఖ్యమైనది. చాలా ఇళ్లలో రాత్రిపూట టిఫెన్ స్థానంలో చపాతీ ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార జీవనశైలి పాటించేవారు, డైటింగ్ చేసేవారు చపాతీని ఎన్నుకుంటారు. అయితే చపాతీలు మరింత ఆరోగ్యాన్ని, పోషకాలను ఇవ్వాలంటే చపాతీ పిండి కలిపేటప్పుడు 3 పదార్థాలు కలిపి చపాతీ తయారుచేసుకుని తింటే సరిపోతుంది. అవేంటో.. అవి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసుకుంటే..
మెంతి..
గోధుమ పిండితో తయారుచేసే చపాతీలు మరింత ఆరోగ్యంగా, పోషకంగా మారాలంటే మెంతి ఆకులు లేదా మెంతి గింజల పొడిని గోధుమ పిండిలో కలపాలి. మెంతికూరలో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు చాలామంచివి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి.
Hair Spa Treatment: మృదువైన జుట్టుకోసం ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్.. ఇలా చేసేయండి..!
అవిసె గింజలు..
అవిసె గింజలను వేయించి పొడిచేసి చపాతీ పిండిలో వేసి కలపాలి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లు, లిగ్నాన్స్ , ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కడుపు ఉబ్బరం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
మునగ..
మునగ ఆకులు లేదా పొడిని కూడా చపాతీ పిండిలో కలిపి చపాతీలు తయారు చేసుకోవచ్చు. విటమిన్-ఎ, సి, ఇ, కాల్షియం, ప్రోటీన్ వంటివి మునగ ఆకులో పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకు చపాతీ పోషకాలను పెంచుతుంది. ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది.
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల లిస్ట్ ఇదీ..!
రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఈ 6 ప్రయోజనాలు మీ సొంతం..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.