Share News

Healthy Rotis: రాగి, గోధుమ, జొన్న.. మూడింటిలో ఏది బెస్ట్? ఆరోగ్యానికి ఏ రొట్టెలు మంచివంటే..!

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:52 PM

అన్ని రకాల వైద్యాలు తృణధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతున్నాయి. అయితే రాగులు, గోధుమలు, జొన్నలు..

Healthy Rotis: రాగి, గోధుమ,  జొన్న.. మూడింటిలో ఏది బెస్ట్? ఆరోగ్యానికి ఏ రొట్టెలు మంచివంటే..!

ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల వైద్యాలు తృణధాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతున్నాయి. రాగులు, గోధుమలు, జొన్నలు.. వీటిని పిండి పట్టించి వీటితో రొట్టెలు చేసుకుని తినడం చాలామంది చేసే పనే.. ఆరోగ్యపరంగా చూస్తే ఇవి మూడూ చాలా మంచివి. వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్-బి, సి మొదలైవి ఉంటాయి. రక్తంలో చక్కెర తగ్గించడంలోనూ, ఆకలిని నియంత్రించి బరువు తగ్గించడంలోనూ, శరీరానికి శక్తిని చేకూర్చడంలోనూ ఇవి సహాయపడతాయి. అయితే రాగులు, జొన్నలు, గోధుమలు.. ఈ మూడింటిలో ఏది బెస్ట్? దేనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుంటే..

రాగి Vs జొన్న..

రాగి, జొన్న, గోధుమలను పోల్చి చూస్తే రాగులలో జొన్నలలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఒక రాగి రొట్టెలో 3.1గ్రాముల ఫైబర్ ఉంటే.. ఒక జొన్న రొట్టెలో 1.4గ్రాముల ఫైబర్ ఉంటుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి, శారీరక పనితీరు సమర్థవంతంగా ఉండటానికి ఫైబర్ కీలకం.

ఇది కూడా చదవండి: బాబోయ్.. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలు ఇవా..!


జొన్న Vs గోధుమ..

జొన్న, గోధుమ రెండింటిలోనూ పోషకాలు, ఫైబర్ ఉంటాయి. ఒక జొన్న రొట్టెలో 1.4గ్రాముల ఫైబర్ ఉంటే.. ఒక గోధుమ రొట్టెలో 1.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్లు ప్రేగుల కదలికను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే గోధుమ రొట్టెల కంటే జొన్న రొట్టెలు బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.

రాగి Vs గోధుమ..

రాగులు, గోధుమలను పోల్చి చూస్తే రాగులలోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. రాగులలో గ్లూటెన్ ఉండదు. ఈ కారణంగా ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. గోధుమలతో పోలిస్తే ఫైబర్ కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ కారణం వల్ల జీర్ణ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.

మల్టిగ్రైన్..

రాగులు చూడటానికి చాలా ముదురు రంగు కలిగి ఉంటాయి. కేవలం రాగులు మాత్రమే కాకుండా రాగులు, జొన్నలు, సద్దలు, గోధుమ మొదలైవి అన్నీ కలిపి పిండి పట్టించి వీటితో మల్టిగ్రైన్ రొట్టెలు తయారుచేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: రోజూ వేరుశనగలు తింటే.. వెయ్యి ఏనుగుల బలం!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 12:52 PM