Share News

Herbal Tea: ఈ హెర్భల్ టీలు తాగండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!

ABN , Publish Date - Aug 11 , 2024 | 01:56 PM

బరువు తగ్గడానికి తీసుకునే పానీయాలలో హెర్భల్ టీ లకు చాలా ఆదరణ ఉంది. 5 రకాల హెర్బల్ టీ లలో ఏ ఒక్కటి తీసుకుంటున్నా

Herbal Tea: ఈ హెర్భల్ టీలు తాగండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!
Herbal Tea

బరువు తగ్గడంలో ఆహార పానీయాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారు వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరు పచ్చిగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలను సలాడ్ రూపంలో తీసుకుంటారు. మరికొందరు మంచి ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకుంటూ వ్యాయామం బాగా చేస్తారు. ఇంకొందరు శరీరంలో అదనపు కేలరీలు, కొవ్వు బర్న్ చేసే పానీయాలు తాగుతారు. బరువు తగ్గడానికి తీసుకునే పానీయాలలో హెర్భల్ టీ లకు చాలా ఆదరణ ఉంది. 5 రకాల హెర్బల్ టీ లలో ఏ ఒక్కటి తీసుకుంటున్నామెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

ఆయుర్వేదంలో అమృతంతో సమానమైన గుణాలు కలిగిన ఆహారాలు ఇవి..!



బ్లాక్ టీ..

శరీర బరువును తగ్గించుకోవడానికి బ్లాక్ టీ బాగా సహాయపడుతుంది. టీ పొడిని నీటిలో మరిగించి వడగడితే బ్లాక్ టీ రెఢీ అయినట్టే.. ఇది కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. జీవక్రియను మెరుగ్గా ఉంచుతుంది.

గ్రీన్ టీ..

బరువు తగ్గడానికి రెగ్యులర్ గా గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం. ఇందులో రుచి కోసం తీపి పదార్థాలను కలపకుండా తీసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కంలగా ఉంటాయి. కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.

ఫ్యాటీ లివర్ సమస్య రావడానికి ఇవే అసలు కారణాలు..!


అల్లం టీ..

అల్లం టీ తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు. అల్లం టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బరువు తగ్గడంలో ప్రభావవవంతంగా ఉంటాయి.

మందార టీ..

మందార పువ్వులను జుట్టు పెరుగుదల కోసం ఉపయోగించడం చూసే ఉంటాం. అయితే ఈ పువ్వులతో చేసిన టీ గొప్ప ఆయుర్వేద పానీయంగా సహాయపడుతుంది. ఇది శరీరంలో అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడం సులువు అవుతుంది.

పుదీనా టీ..

బరువు తగ్గడానికి పుదీనీ టీ కూడా తీసుకోవచ్చు. ఇది శరీరంలో అదనపు కొవ్వును, కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. పుదీనా ఆకులను నీటిలో మరిగించి తాగుతూ ఉంటే బరువు తగ్గుతారు.

ప్రతిరోజూ సూర్య నమస్కారాలు వేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

అరచేతులను రుద్దితే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా..?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 11 , 2024 | 01:57 PM