Share News

High Protein: ప్రోటీన్ శరీరానికి అవసరమే.. కానీ దీన్ని ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

ABN , Publish Date - Aug 02 , 2024 | 03:31 PM

ఆరోగ్యకరమైన శరీరానికి విటమిన్లు, ఖనిజాలతో పాటూ ప్రోటీన్ కూడా ముఖ్యం. ప్రోటీన్ శరీరంలో కండరాల నిర్మాణానికి అత్యవసరం. బరువు కంట్రోల్ లో ఉండాలన్నా, శరీరంలో వివిధ అవయవాలు వాటి పనిని సక్రంమంగా నిర్వర్తించాలన్నా ప్రోటీన్ చాలా అవసరం. అయితే..

High Protein:  ప్రోటీన్ శరీరానికి అవసరమే.. కానీ దీన్ని ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?
protein

ఆరోగ్యకరమైన శరీరానికి విటమిన్లు, ఖనిజాలతో పాటూ ప్రోటీన్ కూడా ముఖ్యం. ప్రోటీన్ శరీరంలో కండరాల నిర్మాణానికి అత్యవసరం. బరువు కంట్రోల్ లో ఉండాలన్నా, శరీరంలో వివిధ అవయవాలు వాటి పనిని సక్రంమంగా నిర్వర్తించాలన్నా ప్రోటీన్ చాలా అవసరం. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అని అన్నట్టు అధికంగా ఏం తీసుకున్నా అది నష్టానికి దారితీస్తుంది. అదే విధంగా ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా అది శరీరంపై దుష్ర్పభావాలు చూపిస్తుంది. అసలు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఎదురయ్యే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుంటే..

స్పాట్ జాగింగ్ ఇంత పవరా? రోజూ 10నిమిషాలు చేస్తే ఏం జరుగుతుందంటే..!



శరీరంలో కండరాల నిర్మాణానికి, కండరాల మరమ్మత్తుకు ప్రోటీన్ చాలా అవసరం. అయితే ఈ ప్రోటీన్ జీర్ణం కావాలి అంటే శరీరంలో నీటిశాతం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ప్రోటీన్ జీర్ణమయ్యే క్రమంలో నీటిని ఎక్కువగా శోషించుకుంటుంది. ఈ విషయం అర్థం చేసుకోకుండా ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వారిలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అంతే కాదు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే నీటి అవసరం పెరగడం, నీరు ఎంత తాగినా అది సరిపోకపోవడం జరుగుతుంది. దీనివల్ల అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

సాధారణంగా ప్రోటీన్ కోసం మాంసాహారం మీద ఆధారపడతారు. అయితే ఇలా ప్రోటీన్ తీసుకునే వారికి కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా కేలరీలు, కొవ్వులు కూడా బోనస్ గా లభిస్తాయి. ఎందుకంటే మాంసాహారంలో కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా కేలరీలు, కొవ్వులు అధికం. పైపెచ్చు మాంసాహారం వండే క్రమంలో ఆరోగ్యకరమైన కొవ్వులు మెల్లిగా చెడు కొవ్వులుగా రూపాంతరం చెందుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా కారణం అవుతాయి. అన్నీ కలిసి బరువు పెరగడానికి దారితీస్తుంది.

ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!


అమ్మోనియా అనే రసాయనం గురించి చాలామంది పుస్తకాలలో చదువుకుని ఉంటారు. కానీ శరీరంలో ప్రోటీన్ విచ్చిన్నమైనప్పుడు అమ్మోనియా విడుదల అవుతుంది. ఈ అమ్మోనియా నోటి దుర్వాసనకు, చెడు శ్వాసకు కారణమవుతుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే శ్వాస సంబంధ సమస్యలు, నోటి ఆరోగ్యం దెబ్బతింటాయి.

శరీరంలో ప్రోటీన్ విచ్చిన్నం కాకపోయినా, శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ శరీరంలో ఉన్నా అది క్రమంగా గట్టిపడి మూత్రపిండాలలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు దీని కారణంగా వస్తాయి.

తినే ఆహారం జీర్ణం కావడానికి జీర్ణ ఎంజైమ్ ల పాత్ర చాలా ఉంటుంది. ఇక ప్రోటీన్ లు బరువైనవి. ఇవి జీర్ణం కావాలంటే జీర్ణ ఎంజైమ్ లు కూడా చాలా ఎక్కువ అవసరం అవుతాయి. శరీరంలో సరిపడినంత జీర్ణ ఎంజైమ్ లు లేకపోతే.. జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలకు కారణం అవుతుంది. అంతే కాదు.. ఎక్కువ ప్రోటీన్ జీర్ణంలో భాగంగా శరీరంలో లివర్ కూడా ఒత్తిడికి లోనవుతుంది. లివర్ పనితీరు దెబ్బతింటుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు నమిలి తింటే.. వీరికి భలే లాభాలు..!


ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కంటే.. జంతువల మాంసం ద్వారా ప్రోటీన్ ఎక్కువ తింటూ ఉంటే ప్రేగు క్యాన్సర్ చాలా తొందరగా వస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరగడం వల్ల గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వస్తాయి.

ఎక్కువ ప్రోటీన్ తింటే శరీరంలో ఉండే ఇతర పోషకాలు అయిన కాల్షియం వంటి వాటితో అసమతుల్యత ఏర్పడుతుంది. శరీరానికి కాల్షియం సరిగా అందకపోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఎముక సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

రోజూ బెల్లం టీ తాగితే ఏం జరుగుతుందంటే..!

మాంసాహారం ఎక్కువగా తినేవారికి ఇన్ని రోగాలు వస్తాయా..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 02 , 2024 | 03:31 PM