Honey: అసలు ఏ తేనె ఆరోగ్యానికి మంచిది.. సాధారణ తేనె, ఆర్గానిక్ తేనె మధ్య తేడాలేంటంటే..
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:07 PM
ఆరోగ్య స్పృహ పెరిగిన కారణంగా నేటి కాలంలో తేనె వినియోగం పెరిగింది. అయితే ఆర్గానిక్ తేనె లేదా సాధారణ తేనె మధ్య తేడాలు చాలామందికి తెలియవు.
తేనె తియ్యని పదార్థం. దీనిని మధు అని పిలుస్తారు. ప్రాచీనకాలం నుండి తేనె వాడుకలో ఉంది. స్వచ్చమైన తేనెకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదని అంటారు. ఎన్ని ఏళ్లు గడిచినా తేనె పాడవ్వదని చెబుతారు. తేనెను ఆయుర్వేద వైద్యంలో భాగంగా కూడా వాడతారు. తేనెలో సహజ చక్కెరలు ఉండటం వల్ల ఎలాంటి సందేహం లేకుండా తీపి కోసం వినియోగిస్తుంటారు. చక్కెర వాడకం పెరిగి జబ్బుల బారిన పడుతున్న ఈ కాలంలో తేనెకు మళ్లీ ఆదరణ పెరిగింది. తీపి పదార్థాల తయారీలో చక్కెర, బెల్లం బదులు తేనెను వినియోగించేవారు ఉన్నారు. అయితే ఇప్పట్లో సాధారణ తేనె, ఆర్గానిక్ తేనె అంటూ మార్కెట్లోనూ, ఆన్లైన్ స్టోర్ లలోనూ గమనిస్తుంటాం. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటో తెలుసుకుంటే వీటిలో ఏది ఆరోగ్యమూ ఇట్టే తెలిసిపోతుంది.
పిల్లలలో కాన్ఫిడెంట్ పెరగాలంటే.. తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులు ఇవీ..
ప్రజల ఆదరణ పెరిగిన ప్రతి పదార్థం కల్తీకి గురి కావడం చూస్తూనే ఉన్నాం. వీటిలో తేనె కూడా ఉంది. ఒకప్పుడు తేనెను అడవులలో, గ్రామాలలో చెట్ల నుండి సేకరించేవారు. అడవుల సంఖ్య తగ్గిపోవడం, గ్రామాలు కూడా పట్టణ రూపాన్ని పులుముకోవడంతో తేనె సహజంగా లభించే తేనె అరుదుగా మారింది. సహజమైన తీపి పదార్థం కావడం చేత తేనె వినియోగం పెరిగింది. ఈ కారణంగా కొన్ని పరిశ్రమలు తేనెను కూడా సాగు చేస్తున్నాయి.
ఆర్గానిక్ తేనె..
ఆర్గానిక్ అనేది ఒక బ్రాండ్ గా రూపాంతరం చెందింది. ఆర్గానిక్ తేనె బాటిళ్ల మీద ప్రభుత్వం నుండి ధృవీకరించబడిన లేబుల్ ఉంటుంది. క్రిమిసంహారకాలు వాడకుండా పెరిగిన మొక్కల పుప్పొడిని సేకరించి ఈ తేనెను తయారు చేస్తారు. ఇందులో ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలు ఏవీ ఉండవు. రుచిలో కూడా ఆర్గానిక్ తేనె తేడాగా ఉంటుంది. ఇది సాధారణ తేనె కంటే ఎక్కువ తియ్యగా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఆర్గానిక్ తేనె చిక్కగా, ముదురు రంగులో ఉంటుంది. ఇది ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చడంలో మెరుగ్గా పనిచేస్తుంది.
Kitchen Tips: కిచెన్ టవల్స్ వాసన వస్తున్నాయా.. ఇలా క్లీన్ చేస్తే ఫ్రెష్ గా ఉంటాయ్..
సాధారణ తేనె..
సాధారణ తేనె విషయానికి వస్తే దీన్ని సహజంగా ఉత్పత్తి చేయరు. ఇప్పట్లో తేనెను కూడా సాగు చేస్తున్న క్రమంలో సాధారణ తేనెను ప్రాసెస్ చేయడంలో భాగంగా పలుమార్లు వేడి చేస్తారు. దీని కారణంగా ఇది రంగు మారుతుంది. లేత రంగులో ఉంటుంది. సాధారణ తేనెలో రసాయనాలు ఉంటాయి. తేనె వల్ల శరీరానికి అందాల్సిన ప్రయోజనాలు చాలా తక్కువగా అందుతాయి.
తేనెను ఉపయోగించే అలవాటు ఉంటే.. ఆర్గానిక్ తేనెను ఉపయోగించడం లేదా సహజంగా చెట్టు నుండి తీసిన తేనెను కొనుగోలు చేసి ఉపయోగించడం చాలా మంచిది. ఇది ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చడంలో కూడా మెరుగ్గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Rainbow Diet: రెయిన్ బో డైట్ అంటే ఏంటి? దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే..!
Health Tips: బాబోయ్.. రాగులు మంచి పోషకాహారమే అనుకున్నాం.. కానీ దీంతో ఈ లాభాలు కూడా ఉన్నాయా..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.