Horse Gram: ఉలవలు ఆహారంలో చేర్చుకుంటే జరిగేదేంటి? మీకు తెలియని షాకింగ్ నిజాలివి..!
ABN , Publish Date - Aug 22 , 2024 | 03:25 PM
ఉలవలు భారతీయ ప్రాచీన ఆహారంలో భాగం. మన బామ్మలు, తాతల కాలంలో వీటిని ఆహారంలో విరివిగా ఉపయోగించేవారు.
ఉలవలు భారతీయ ప్రాచీన ఆహారంలో భాగం. మన బామ్మలు, తాతల కాలంలో వీటిని ఆహారంలో విరివిగా ఉపయోగించేవారు. ఇలాంటి ఆహరం తినడం వల్లనే వారు వృద్దాప్యంలో చాలా బలంగా ఉన్నారని చెప్తుంటారు. అయితే నేటి కాలం ప్రజలు కూడా ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. గుర్రానికి ఉలవలు పెట్టడం వల్లే అది అంత చురుగ్గా ఉంటుందని అంటుంటారు. అయితే ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..
Sweetcorn: స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? ఈ నిజాలు తెలుసా?
ఉలవలు తింటే శరీరంలో కాల్షియం, పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఇది మాత్రమే కాకుండా ఇది శరీరం నుండి టాక్సిన్లు తొలగించడంలో సహాయపడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఉలవలు తింటూ ఉంటే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతుంది.
చాలా సన్నగా, బలహీనంగా ఉన్నవారు సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకోలేని వారు ఉలవలను ఆహారంలో తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసినంత ప్రోటీన్ లభిస్తుంది. పిల్లలు, యువత వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల పెరిగే వయసుకు తగినంత ప్రోటీన్ లభించి ప్రోటీన్ లోపం సమస్యలు దరిచేరవు.
రోజూ ఒక నారింజ పండు తినండి.. ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి..!
ఉలవలను ఆహారంలో భాగం చేసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు కరిగిపోతాయట. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఉలవల నీరు తీసుకోమని ఆహార నిపుణులు సిఫారసు చేస్తారు. కొన్ని ఉలవలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టాలి. వడగట్టిన నీటిని తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట.
ఉలవలను పొడి చేసి నీటిలో కలిపి తాగవచ్చు. ఇది మాత్రమే కాకుండా నానబెట్టిన ఉలవలను నేరుగా నమిలి తనవచ్చు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు 5 నుండి 7 రోజుల పాటూ వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య నుండి ఉపశమనం ఉంటుంది.
ఈ ఆహారాలు తినండి.. ఎన్నేళ్లు అయినా జుట్టు నెరవదు..!
ఊబకాయం తో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉలవలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉలవలు శరీరంలో కొవ్వు కరిగించడంలో గొప్పగా సహాయపడతాయి. వీటిలో పైబర్ మెరుగ్గా ఉంటుంది. ప్రోటీన్ కూడా సమృద్దిగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాదు.. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది.
శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉలవలు సహాయపడతాయి. అయితే ఉలవలు చాలా వేడి చేస్తాయి. వీటిని రెగ్యులర్ గా తినాలి అనుకుంటే రోజుకు ఒక స్పూన్ తినవచ్చు . అయితే ఇవి తిన్న తరువాత శరీరం వేడి నుండి ఉపశమనం ఉండాలంటే నీరు బాగా తాగాలి. అలాగే పెసలు, సబ్జా నీరు, కొబ్బరి నీరు వంటి శరీరానికి చలువ చేసే ఆహారాలు తీసుకోవాలి.
ఈ సమస్యలున్న వారు పొరపాటున కూడా నిమ్మరసం తీసుకోకూడదు..!
ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే.. ఈ సమస్యలున్న వారికి భలే లాభాలు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.