Share News

Liver Damage Signs: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!Liver Damage Signs: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!

ABN , Publish Date - Aug 11 , 2024 | 09:50 PM

Liver Damage Signs: ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై అంతగా దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే వారిని అనారోగ్యానికి గురి చేస్తోంది. చెడు ఆహారపు అలవాట్లు, సరిగా నిద్రపోకపోవడం, ధూమపానం వంటి అలవాట్లు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి.

Liver Damage Signs: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!Liver Damage Signs: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
Liver Damage Signs

Liver Damage Signs: ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై అంతగా దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే వారిని అనారోగ్యానికి గురి చేస్తోంది. చెడు ఆహారపు అలవాట్లు, సరిగా నిద్రపోకపోవడం, ధూమపానం వంటి అలవాట్లు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. వీటి వల్ల కాలయం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ప్రస్తుత కాలంలో ఎంతో మంది కాలెయ సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్నారు. కాలేయ సమస్యలను సకాలంలో గుర్తిస్తే ప్రాణాంతక సమస్య నుంచి బయటపడొచ్చు. అయితే, కాలేయ సంబంధిత సమస్యలుంటే.. రాత్రి వేళలో మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయిని, వాటిని విస్మరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఫ్యాటీ లివర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి?

ఎక్కువగా ఆల్కహాల్ తాగడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం, శారీరక శ్రమ చేయకపోవడం వల్ల సాధారణంగా ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధి రెండు రకాలు. మొదటిది- ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD), రెండవది- నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD).


1. కడుపు నొప్పి..

కాలేయం దెబ్బతిన్నప్పుడు కడుపు నొప్పి మొదలవుతుంది. కాలేయం సమస్యలుంటే దాని సామర్థ్యం తగ్గుతుంది. దీని కారణంగా దాని పరిమాణం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. అలా కాలేయంపై ఒత్తిడి పెరిగి నొప్పి తీవ్రమవుతుంది.

2. చర్మంపై దురద..

కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే, చర్మంపై దురద సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా రాత్రిపూట దురద, చికాకు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. లేదంటే సమస్య మరింత తీవ్రమవుతుంది.

3. మైకము, వాంతులు, వికారం..

వికారం, వాంతులు వంటి సమస్యలు కూడా కాలేయం సమస్యల్లో ప్రధాన లక్షణం. ఈ రకమైన సమస్య రాత్రిపూట సంభవిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆలస్యం మరింత ప్రమాదకరం. ఇది ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం.


4. మూత్రం రంగులో మార్పు..

మూత్రం రంగు మారడం కాలేయం దెబ్బతినడానికి సంకేతం. కాలేయం దెబ్బతిన్నప్పుడు, శరీరంలో బిలిరుబిన్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా మూత్రం రంగు ముదురు పసుపు రంగులోకి మారుతుంది. మీకు ఇలాగే ఉంటే.. వెంటనే డాక్టర్‌కి చూపించుకోవాలి.

5. వాపు..

రాత్రి వేళల్లో కాళ్ల కింది భాగంలో వాపు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. విపరీతమైన వాపు, నొప్పి కాలేయ సంబంధిత సమస్యలకు సంకేతాలు. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

For More Health News and Telugu News..

Updated Date - Aug 11 , 2024 | 09:50 PM