Share News

Instant Coffee: ఇన్సంట్ కాఫీ తాగడం మంచిదేనా.. వైద్యులు ఏమంటున్నారంటే..

ABN , Publish Date - Nov 04 , 2024 | 08:20 PM

కాఫీ ప్రియులకు పని తగ్గించడంలో ఇన్స్టంట్ కాఫీ బాగా సహాయపడిందని చెప్పవచ్చు. కానీ దీన్ని రోజూ తాగడం ఎంత వరకు మేలంటే..

Instant Coffee: ఇన్సంట్ కాఫీ తాగడం మంచిదేనా.. వైద్యులు ఏమంటున్నారంటే..
Instant Coffee

ఒకప్పుడు టీ అనేది కేవలం పట్టణాలలో అందునా హోటళ్లలో మాత్రమే తయారు చేసేవారు. పల్లెటూళ్లలో అయినా, పట్టణాలలో ఇళ్లలో అయినా ఎక్కువగా కాఫీనే తయారు చేసేవారు. ఆ రోజు కాఫీ అంటే చాలా ఎమోషన్. ఇప్పటికీ కాఫీని ఇష్టపడేవారు ఉన్నా దాని ప్రాసెస్ చాలా వరకు మారిపోయింది. కాఫీ ప్రియులు ఎక్కువ మంది కాఫీ డికాషన్ తయారు చేసి కాఫీ చేయడం మానేశారు. ఇన్స్టంట్ లైఫ్ లో ఇన్స్టంట్ కాఫీలు, కాఫీ బ్యాగ్ లు వచ్చి చేరాయి. వీటితో కొన్ని నిమిషాలలోనే కాఫీ తయారు చేసుకుని తాగడం సులభం. కాఫీ కోసం విలవిలలాడే ప్రాణాలకు ఇన్స్టంట్ కాఫీ చాలా రిలీఫ్ ను ఇస్తుంది. పైగా టైం కూడా సేవ్ చేస్తుంది. కానీ ఇన్స్టంట్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?దీని గురించి వైద్యులు కొన్ని షాకింగ్ నిజాలు చెబుతున్నారు.

Acidity: రోజూ ఈ ఒక్క పదార్థం తింటుంటే చాలు.. ఎసిడిటీ సమస్య పరార్..


కాఫీ, టీ లకు బాగా అలవాటైపోయిన వారికి కాస్త అలసటగా అనిపించినా, తలనొప్పి అనిపించినా వెంటనే ఓ కప్పు కాఫీ తాగేస్తారు. దీని వల్ల శరీరానికి కెఫీన్ అందడం ద్వారా శరీరం ఉత్తేజితమవుతుంది. పనులను తిరిగి మామూలుగా చేసుకోగలుగుతారు. ఇన్స్టంట్ కాఫీని నిమిషాలలో తయారు చేసుకోవడం వల్ల చాలామంది కాఫీ అంటే ఇన్స్టంట్ పౌడర్ తోనే అన్నట్టు తయారయ్యారు. అయితే ఇన్స్టంట్ కాఫీతో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి.

ప్రయోజనాలు..

  • ఇన్స్టంట్ కాఫీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

  • ఇన్స్టంట్ కాఫీ తాగితే టైప్-2 డయాబెటిస్ ప్రమాదం, కాలేయ క్యాన్సర్ వంటివి రాకుండా చేస్తుంది.

  • ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు కాఫీ తాగాలని అనిపిస్తే అప్పుడు తాగవచ్చు.

  • సాంప్రదాయ కాఫీలతో పోలిస్తే ఇన్స్టంట్ కాఫీలో కెఫీన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.

  • ఇన్స్టంట్ కాఫీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. ఇందులో ఉండే కెఫీన్ మెదడును చురుగ్గా ఉంచుతుంది.

Health Tips: వెల్లుల్లి ఇలా తింటే యూరిక్ యాసిడ్ సమస్య మాయం..


దుష్ప్రభావాలు..

  • ఇన్స్టంట్ కాఫీని తయారు చేసుకోవడం సులభం. ఈ కారణంగా కాఫీ తాగాలని అనిపించినప్పుడల్లా కాఫీని సులభంగా తయారుచేసుకుని తాగుతారు. దీని వల్ల కెఫీన్ కంటెంట్ ఎక్కువ తీసుకునే ప్రమాదం ఉంటుంది.

  • ఇన్స్టంట్ కాఫీ ఆరోగ్యకరమైనదే అయినా దీన్ని తయారు చేసిన విధానం కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ప్రాసెస్ చేసే క్రమంలో అందులో ఉన్న ప్రయోజనకరమైన పదార్థాలు విచ్చిన్నం కావచ్చు. దీనివల్ల కాఫీ కారణంగా అందాల్సిన ప్రయోజనాలు అందకుండా పోతాయి.

  • రోజూ ఇన్స్టంట్ కాఫీ తీసుకోవచ్చు. కానీ దీన్ని కూడా మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి..

30రోజులు ఉల్లి, వెల్లుల్లి తినడం మానేస్తే శరీరంలో కలిగే మార్పులివే..

15రోజులు ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఏం జరుగుతుంది..?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 04 , 2024 | 08:20 PM