Share News

Iron Foods: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా? ఈ 7 రకాల విత్తనాలలో ఏవి తీసుకున్నా సరే.. ఇట్టే పెంచుకోవచ్చు..!

ABN , Publish Date - May 20 , 2024 | 03:09 PM

శరీరానికి చాలా రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు అవసరమవుతాయి. వీటిలో ఐరన్ కూడా ముఖ్యమైనది. హిమోగ్లోబిన్ స్థాయి సరైన మోతాదులో ఉండాలంటే ఐరన్ ఖచ్చితంగా అవసరం. శరీరానికి సరిపడినంత ఐరన్ లభించకపోతే ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Iron Foods: ఐరన్ లోపంతో  బాధపడుతున్నారా? ఈ 7 రకాల విత్తనాలలో ఏవి తీసుకున్నా సరే.. ఇట్టే పెంచుకోవచ్చు..!

శరీరానికి చాలా రకాల విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు అవసరమవుతాయి. వీటిలో ఐరన్ కూడా ముఖ్యమైనది. హిమోగ్లోబిన్ స్థాయి సరైన మోతాదులో ఉండాలంటే ఐరన్ ఖచ్చితంగా అవసరం. శరీరానికి సరిపడినంత ఐరన్ లభించకపోతే ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ప్రమాదం కూడా. నెలసరి సమస్యల నుండి రక్తహీనత వరకు ఐరన్ లోపం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు అధిగమించాలంటే ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఐరన్ పుష్కలంగా ఉండే 7 రకాల విత్తనాల గురించి తెలుసుకుని వాటిలో ఏ కొన్ని తీసుకున్నా సరిపోతుంది.

చియా విత్తనాలలో ఒమెగా-3 ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఐరన్ ను పెంచడంలో ఇవి తోడ్పడతాయి.

చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!


నువ్వులలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కంటి ఆరోగ్యానికి అవసరమైన లుటిన్, జియాంక్సంతిన్ లతో సహా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. రక్తహీనత, ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు గుమ్మడికాయ విత్తనాలు తింటే చాలా మంచిది.

పిస్తా పప్పు తిన్నా కూడా ఐరన్ లోపాన్ని నివారించవచ్చు. ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతున్నవారు రోజూ కొన్ని పిస్తా పప్పులు తింటూ ఉంటే ఐరన్ భర్తీ అవుతుంది.

అవిసె గింజలలో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లిగ్నాన్స్ మెండుగా ఉంటాయి. ఇవి రక్తహీనత, ఐరన్ లోపాన్ని సమర్థవంతంగా తగ్గించగలవు.

జనపనార విత్తనాల గురించి తెలిసినవారు చాలా తక్కువ. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా-3, ఒమేగా-6 ఉంటాయి. అలాగే ఐరన్ కూడా పెంచుతాయివి.

గసగసాలలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకుంటే ఐరన్ లోటును భర్తీ చేయవచ్చు.

చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!

బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 20 , 2024 | 03:09 PM