Jaggery: ఆహారంలో చక్కెరకు బదులుగా బెల్లం చేర్చుకుంటే జరిగేదేంటి? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!
ABN , Publish Date - Jul 14 , 2024 | 02:18 PM
బెల్లం భారతీయులు ఎన్నో ఏళ్ల నుండి వాడుతున్న తీపి పదార్థం. చెరకు నుండి తయారయ్యే బెల్లంతోనే ఒకప్పుడు అన్ని రకాల తీపి వంటలు తయారు చేసేవారు. అంతేనా బెల్లాన్ని ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగించేవారు. కానీ భారతీయులకు చక్కెర పరిచయం అయ్యాక బెల్లం వాడకం తగ్గింది.
బెల్లం భారతీయులు ఎన్నో ఏళ్ల నుండి వాడుతున్న తీపి పదార్థం. చెరకు నుండి తయారయ్యే బెల్లంతోనే ఒకప్పుడు అన్ని రకాల తీపి వంటలు తయారు చేసేవారు. అంతేనా బెల్లాన్ని ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగించేవారు. కానీ భారతీయులకు చక్కెర పరిచయం అయ్యాక బెల్లం వాడకం తగ్గింది. చక్కెర అధిక వినియోగం ఆరోగ్యానికి చాలా నష్టాలు తెచ్చిపెడుతోందని వైద్యుల నుండి పరిశోధనల వరకు స్పష్టం చేస్తున్నాయి. అయితే చక్కెరకు బదులుగా బెల్లాన్ని చేర్చుకుంటే ఏం జరుగుతుందో.. శరీరంల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే..
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి నష్టం చేకూర్చే వివిధ రకాల ఫ్రీ రాడికల్స్ తో పోరాడటంలో సహాయపడతాయి. అందుకే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుతుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది.
ఈ సమస్యలున్న వారు ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగకూడదు..!
బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్దకం, అపానవాయువు వంటి జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు శరీరంలో టాక్సిన్లను బయటకు పంపి శరీరాన్ని శుద్ది చేయడంలో సహాయపడుతుంది.
చక్కెర వేగంగా శక్తిని విడుదల చేస్తుంది. ఇది తొందరగా రక్తంలో కలిసిపోతుంది కానీ కరగదు. అదే బెల్లం అయితే నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. ఇది రోజంతా చురుగ్గా, శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. బెల్లంలో ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇవి రక్తప్రసరణ సక్రమంగా నిర్వహించడానికి, నెలసరి నొప్పులు, తిమ్మిర్లు తగ్గించడంలోనూ సహాయపడతాయి.
అంజీర్ తింటే ఈ 7 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!
భారతదేశంలో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతన్న సమస్యలలో అనీమియా ఒకటి. అనీమియాతో బాధపడేవారు బెల్లాన్ని తీసుకుంటే ఐరన్ లోపం భర్తీ అవుతుంది. బెల్లంలో ఉండే ఖనిజాలు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, సీజనల్ సమస్యలను ఎదుర్కోవడంలోనూ సహాయపడతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో బెల్లాన్ని వినియోగించడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.
ఉబ్బసం, బ్రోన్కైటిస్, అలెర్జీలు వంటి శ్వాస సమస్యలు నివారించడంలో బెల్లం బాగా సహాయపడుతుంది. బెల్లంలో ఉండే యాంటీ అలెర్జీ లక్షణాల కారణంగా శ్వాస సంబంధ సమస్యలు నివారించబడతాయి. వర్షాకాలంలో ఎక్కువయ్యే ఈ శ్వాస సమస్యలకు చెక్ పెట్టాలంటే చక్కెరకు బదులుగా బెల్లం వాడటం మంచిది.
జాపత్రిని ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలివే..!
ఈ సమస్యలున్న వారు ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగకూడదు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.