Share News

Joint Pains: వర్షాకాలంలో కీళ్ల నొప్పుల సమస్య రాకూడదంటే.. ఏం తినాలి? ఏం తినకూడదు?

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:31 PM

ఇన్నాళ్లు వేసవి గురించి, వేసవికాలం బాధల గురించి చెప్పకుంటూ వచ్చారు అందరూ. అయితే ఇప్పుడు సీన్ మారింది. దేశ వ్యాప్తంగా వర్షాల సందడి మొదలైంది. వర్షాల కారణంగా వాతావరణమే కాదు.. ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. వర్షాకాలంలో చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు.

Joint Pains: వర్షాకాలంలో కీళ్ల నొప్పుల సమస్య రాకూడదంటే.. ఏం తినాలి? ఏం తినకూడదు?

ఇన్నాళ్లు వేసవి గురించి, వేసవికాలం బాధల గురించి చెప్పకుంటూ వచ్చారు అందరూ. అయితే ఇప్పుడు సీన్ మారింది. దేశ వ్యాప్తంగా వర్షాల సందడి మొదలైంది. వర్షాల కారణంగా వాతావరణమే కాదు.. ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. వర్షాకాలంలో చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చకోవడం, కొన్ని ఆహారాలు మినహాయించడం చేయాలి. అవేంటో తెలుసుకుంటే..

ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగితే.. ఈ 5 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!


ఏం తినాలి?

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో కీళ్లలో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజలు, వాల్‌నట్‌లు, చియా గింజలు, సోయాబీన్, బ్రోకలీ వంటి ఆహారాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

వర్షాకాలంలో కీళ్ల నొప్పులు, కీళ్లు దృఢంగా లేకపోవడం లేదా వాపు వంటి కీళ్ల సంబంధిత సమస్యలను తగ్గించడంలో పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. రోజువారీ భోజనంలో పసుపును క్రమం తప్పకుండా చేర్చుకోవచ్చు. అలాగే పసుపు పాలు తాగవచ్చు.

ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగితే.. ఈ 5 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!


ఏం తనకూడదు?

చిప్స్, నూడుల్స్ వంటి ప్యాక్ చేయబడిన లేదా ప్రాసెస్ చేయబడిన ఆహారం రుచికరంగానూ, వండుకునే పనిని తగ్గించి సమయాన్ని ఆదా చేయవచ్చు. కానీ ఇది కీళ్ల నొప్పులతో సహా మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్యాక్ చేసిన ఆహారాలలో కృత్రిమ చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. అవి రుచిగా ఉన్నా శరీరంలో దీర్ఘకాలం నిల్వ ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. ఇవి నేరుగా కీళ్లను ఒత్తిడికి గురిచేస్తాయి. వాపు, కీళ్ల నొప్పులకు దారితీస్తాయి. వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జంక్ ఫుడ్ లేదా ప్యాక్ చేసిన ఆహారాన్ని నివారించాలి.

చక్కెర ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా శుద్ధి చేసిన చక్కెర శరీరంలో మంటకు దారితీస్తుంది. ఇది కీళ్లనొప్పుల సమస్యను పెంచుతుంది. వర్షాకాలంలో కీళ్ల నొప్పులను తగ్గించడానికి రిఫైన్ షుగర్ లేదా క్యాండీలు, చాక్లెట్లు, సోడా వంటి చక్కెర ఆధారిత ఉత్పత్తులను తినడాన్ని నివారించడం లేదా తగ్గించడం ముఖ్యం. అధిక పరిమాణంలో చక్కెర తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది.

పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?

ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగితే.. ఈ 5 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 12 , 2024 | 12:31 PM