Kitchen Tips: అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిదేనా దీన్నెలా నిల్వ చేయాలంటే..
ABN , Publish Date - Oct 17 , 2024 | 03:44 PM
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయని వంట ఉండదంటే అతిశయోక్తి కాదు.. కానీ వీటిని ఎలా నిల్వచేయాలి? ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా?
అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఈ మద్య కాలంలో వంటల్లో చాలా సాధారణం అయిపోయింది. మొదట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను మసాలా వంటల్లోనే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాధారణ కూరల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పెద్ద మొత్తంలో తయారు చేసుకుని లేదా కొని ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తుంటారు. అయితే దీన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం మంచిదేనా? దీన్ని నిల్వ చేయడానికి సరైన పద్దతి ఏంటి? అల్లాన్ని, వెల్లుల్లిని ఫ్రిజ్ లో పెడితే జరిగేదేంటి?
Health Tips: వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..
అల్లం..
టీ నుండి కూరలు వండటం వరకు అల్లం వాడతారు. చలికాలంలో అల్లం ఎక్కువగా తీసుకుంటారు. అయితే అల్లం చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అయితే అల్లాన్ని మార్కెట్ నుండి తీసుకురాగానే నేరుగా ఏదో ఒక కవర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటారు. అవసరమైనప్పుడు వాడుకోవడానికి తీసుకుని దాన్ని కడిగి వాడుతుంటారు. ఈ సందర్బాలలో కొన్ని సార్లు అల్లం కుళ్లిపోవడం కూడా గమనించవచ్చు. అయితే అల్లం అలా పాడవకుండా ఉండాలంటే మార్కెట్ నుండి తీసుకురాగానే అల్లాన్ని శుభ్రంగా కడగాలి. అల్లానికి మురికి, మట్టి పోయేదాక కడిగి ఆ తరువాత పొడి గుడ్డతో తుడవాలి. గాలికి ఆరబెట్టిన తరువాత గాలి చొరబడని కంటైనర్ లో ఒక కాగితం పెట్టి అందులో అల్లాన్ని ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అల్లం నెలల తరబడి కూడా పాడవకుండా నిల్వ ఉంటుంది.
Heart Blockage: మీ ధమనులు శుభ్రంగా ఉన్నాయా లేదా ఇలా నిర్ధారించుకోండి..
వెల్లుల్లి..
అల్లాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచినట్టు చాలామంది వెల్లుల్లిని కూడా ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. ముఖ్యంగా బిజీ లైఫ్ లో ఉన్నవారు కూరగాయలను తీరక దొరికినప్పుడు కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు. ఉదయాన్నే వంట, టిఫిన్ చేయడానికి చాలా సులువుగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఇలా కూరగాయలు ముందే కట్ చేసి పెట్టుకోవడం కానీ, వాటితో పాటు వెల్లుల్లిని ముందే ఒలిచి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవడం కాదు. వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో ఉంచితే మొలకలు వస్తాయి. పైగా వాటిని సరిగా నిల్వచేయకపోతే పాలు, పెరుగు సహా అన్ని పదార్థాలకు వెల్లుల్లి వాసన పట్టేస్తుంది. కాబట్టి వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో పెట్టకపోవడం మంచిది.
Baby Care: చిన్నపిల్లలకు ఆయిల్ మసాజ్ చేస్తున్నారా ఈ నిజాలు తప్పక తెలుసుకోండి..
అల్లం వెల్లుల్లి పేస్ట్..
చాలామంది ఇన్స్టంట్ లైఫ్ కు అలవాటు పడిపోయారు. కూరల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా మార్కెట్లో తెచ్చి వాడుతుంటారు. దీన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి వాడుకుంటారు. షెల్ప్ లైఫ్ కోసం వీటిలో రసాయనాలు జోడిస్తారు. ఒకసారి ఈ ప్యాకెట్స్ ను ఓపెన్ చేశాక వీటిని ఎక్కవ కాలం ఫ్రిడ్జ్ లో అయినా సరే నిల్వ చేయడం మంచిది కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువకాలం ఫ్రిడ్జ్ లో నిల్వ ఉండాలంటే ఒక కప్పు అల్లానికి, రెండు కప్పుల వెల్లుల్లి జోడించి పేస్ట్ చేసుకోవాలి.ఇందులో టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక కప్పు నూనె కలిపి ఇంకొక సారి గ్రైండ్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇలా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేని పక్షంలో అల్లం వెల్లుల్లితో తాజాగా పేస్ట్ తయారు చేసుకుని వంటల్లో వినియోగించడం మంచిది.
ఇవి కూడా చదవండి..
ఈ పండ్లు తినండి రక్తంలో చక్కెర స్థాయిలకు చెక్ పెట్టచ్చు..
ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.