Lemon Grass: అచ్చం నిమ్మకాయను తలపించే నిమ్మగడ్డితో టీ చేసుకుని రోజూ తాగితే శరీరంలో కలిగే మార్పులివే..!
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:44 PM
నిమ్మగడ్డి.. చూడటానికి సాధారణ గడ్డిలాగే ఉంటుంది. కానీ ఈ మొక్కను కాస్త చేత్తో నిలిపినా దీన్ని కాస్త దగ్గరనుండి వాసన చూసినా అచ్చం నిమ్మకాయను వాసన చూసినట్టే ఉంటుంది. ఈ నిమ్మగడ్డిని నీటిలో వేసి బాగా మరిగించి టీలా తీసుకుంటారు. దీన్ని రోజూ తాగితే..
నిమ్మగడ్డి.. చూడటానికి సాధారణ గడ్డిలాగే ఉంటుంది. కానీ ఈ మొక్కను కాస్త చేత్తో నిలిపినా దీన్ని కాస్త దగ్గరనుండి వాసన చూసినా అచ్చం నిమ్మకాయను వాసన చూసినట్టే ఉంటుంది. ఈ నిమ్మగడ్డిని నీటిలో వేసి బాగా మరిగించి టీలా తీసుకుంటారు. నిమ్మగడ్డి గురించి, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసినవారు చాలా తక్కువ. రోజూ నిమ్మగడ్డితో తయారుచేసిన టీని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
యాంటీఆక్సిడెంట్లు..
నిమ్మగడ్డి టీలో క్లోరోజెనిక్ యాసిడ్, ఐసోరియంటిన్, స్వెర్టియాజపోనిన్ వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఎదురయ్యే పరిణామాలు ఇవే..!
యాంటీమైక్రోబయల్..
నిమ్మగడ్డి టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వివిధ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇది కావిటీస్ చికిత్సలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. నిమ్మగడ్డి టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు.
శోథనిరోధక లక్షణాలు..
నిమ్మగడ్డిలో ఉండే సిట్రల్, జెరేనియం సమ్మేళనాలు మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి.ఆర్థరైటిస్ వంటి సమస్యలతో సంబంధం ఉన్న వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు నిమ్మగడ్డిలో ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!
జీర్ణ లక్షణాలు..
నిమ్మగడ్డి టీ సాంప్రదాయకంగా అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. కడుపు నొప్పి, తిమ్మిర్లు, ఇతర జీర్ణ సమస్యలకు సులభమైన ఇంటి నివారణగా నిమ్మగడ్డి టీ పనిచేస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!
ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఎదురయ్యే పరిణామాలు ఇవే..!
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.