Lemon Juice: నిమ్మరసం బాగా వాడుతుంటారా? చాలామందికి తెలియని నిజాలు ఇవీ..!
ABN , Publish Date - Aug 14 , 2024 | 03:27 PM
నిమ్మకాయలు, నిమ్మరసం భారతీయ వంటింట్లో చాలా విరివిగా వాడుతుంటారు.
నిమ్మకాయలు, నిమ్మరసం భారతీయ వంటింట్లో చాలా విరివిగా వాడుతుంటారు. నిమ్మకాయ పానకం, నిమ్మకాయ జ్యూస్, నిమ్మ సోడా నుండి నిమ్మకాయ పులిహోర, నిమ్మకాయ పచ్చడి వరకు నిమ్మరసాన్ని చాలా విధాలుగా వాడతారు. ఇక విదేశీయులు అయితే నిమ్మరసాన్ని ఆహారాలలో పులుపు కోసం చింతపండుకు బదులుగా వాడుతుంటారు. అయితే నిమ్మరసం గురించి చాలా మందికి తెలియని నిజాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేస్తే..
ఒక మీడియం సైజ్ నిమ్మకాయలో 35మి.గ్రా విటమిన్-సి ఉంటుంది. ఇది రోజువారీ విటమిన్-సి అవసరాన్ని భర్తీ చేస్తుంది. రోజులో తాజా నిమ్మరసం తీసుకోవడానికి ప్రయత్నిస్తే విటమిన్-సి లోపం అనేదే రాదు.
Independence Day: భారతదేశం మాత్రమే కాదు.. ఈ దేశాలు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాయి..!
నిమ్మరసంలో పొటాషియం ఉంటుంది. రోజూ తాజా నిమ్మరసాన్ని తీసుకుంటే శరీరానికి పొటాషియం అంది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.
నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పునరుజ్జీవనాన్ని ఇస్తాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మం ముడతలు, గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది.
రోజూ తాజా నిమ్మరసాన్ని తీసుకుంటూ ఉంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇది శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. శరీరం శుద్ది అవుతుంది.
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లను నివారించడంలో సహాయపడుతుంది. రోజూ తాజా నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!
లిమోనెన్, ఫ్లేవనాల్ గ్లైకోసెడ్ లతో సహా 22 రకాల రసాయనాలు నిమ్మరసంలో ఉంటాయి. ఈ రసాయనాలు శరీరంలో క్యాన్సర్ కణతులను ఏర్పరచకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
నిమ్మకాయ తొక్కలో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి మెదడు అభివృద్దిని ప్రోత్సహిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగితే శరీరంలో PH స్థాయి నియంత్రణలో ఉంటుంది.
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జీవక్రియను బలోపేతం చేస్తాయి. రోజూ తాజా నిమ్మరసం తీసుకుంటూ ఉంటే జీవక్రియ బలంగా ఉంటుంది.
నిమ్మకాయలో సహజ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణలు ఉంటాయి. ఇది చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటూ నోటి ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.
ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
టీతో రస్క్ తినే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలిస్తే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.