Diabetes: నిమ్మరసంలో ఈ గింజలను కలుపుకుని తాగితే.. షుగర్ పూర్తిగా అదుపులో ఉంటుంది..
ABN , Publish Date - Dec 03 , 2024 | 04:07 PM
నేచురల్ గా డయాబెటిస్ ని కంట్రోల్ చేయాలంటే ఈ గింజలను నిమ్మరసంలో మిక్స్ చేసి తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా తాగితే కేవలం రెండు నెలల్లోనే షుగర్ పూర్తిగా అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు.
మధుమేహం పానీయాలు: ఈ మధ్య కాలంలో చాలా మందిని మధుమేహం సమస్యగా ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. అయితే, కొన్ని సహజ పదార్థాలు రక్తంలో చక్కెరను సహజంగా తగ్గించడంలో మీకు సహాయపడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సిట్రిక్ యాసిడ్ కలిగి ఉన్న ఈ నిమ్మకాయ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సులభంగా కంట్రోల్ చేస్తుంది.
చియా విత్తనాలు..
చియా విత్తనాలను నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయి. చియా విత్తనాలు శరీరంలో జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడతాయి. చియా విత్తనాలు కూడా చక్కెర నియంత్రణలో పనిచేస్తాయి. చియా విత్తనాలను నిమ్మరసంలో కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పటికే మధుమేహం సమస్యలు ఉన్నవారిలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో..
ముందుగా ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో నిమ్మరసం కలపాలి. ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టిన చియా గింజలను వేయాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని కొద్దిగా తేనె మిక్స్ చేసి త్రాగాలి. చియా గింజలను నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా విత్తనాలు శరీరం నుండి కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే కేవలం రెండు నెలల్లోనే షుగర్ పూర్తిగా అదుపులో ఉంటుందని చెబుతున్నారు.
(Note: ఈ కథనం ఇంటి నివారణలు, సాధారణ సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)