Share News

Magnesium Deficiency: ఈ 7 లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా సరే.. మెగ్నీషియం లోపమున్నట్టేనట..!

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:07 PM

విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ద్రవాలు ఇలా అన్ని సమతుల్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇప్పటి ఆహార విధానాలు, జీవనశైలి కారణంగా చాలా లోపాలు ఏర్పడుతుంటాయి. వాటిలో మెగ్నీషియం లోపం కూడా ఒకటి. మెగ్నీషియం లోపిస్తే జరిగేది ఇదీ..

Magnesium Deficiency: ఈ 7 లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా సరే.. మెగ్నీషియం లోపమున్నట్టేనట..!

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా పోషకాలు అవసరం అవుతాయి. విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ద్రవాలు ఇలా అన్ని సమతుల్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇప్పటి ఆహార విధానాలు, జీవనశైలి కారణంగా చాలా లోపాలు ఏర్పడుతుంటాయి. వాటిలో కాల్షియం, ఐరన్, విటమిన్లు వంటివి ఉంటాయి. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతంది? శరీరంలో కనిపించే ల7ణాలు ఏంటి? తెలుసుకుంటే..

=> శరీరంలో కండరాల పాత్ర చాలా పెద్దది. కండరాలు బలంగా ఉంటే శరీరం పట్టుత్వంతో ఉంటుంది. అయితే మెగ్నీషియం తక్కువగా ఉంటే కాళ్లలోని కండరాల తిమ్మిరి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

ఈ ఆహారాలను పొరపాటున కూడా కలిపి తినకండి..!


=> రోజూ ఎంత ఆహారం తీసుకుంటున్నా, ఎంత బాగా తింటున్నా కొందరిలో ఎప్పుడూ అలసట గానూ, బలహీనంగానూ అనిపిస్తూ ఉంటుంది. దీనికి మెగ్నీషియం లోపం కారణమవుతుంది. మెగ్నీషియం లోపిస్తే అలసట, బలహీనత ఎక్కువ ఉంటాయి.

=> మానసిక సమస్యలు ఉండే వారిలో మెగ్నీషియం లోపం ఉండే అవకాశం ఉంది. ఆందోళన, నిరాశ, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు మెగ్నీషియం లోపం కారణమవుతుంది.

=> కొందరిలో చిన్న చిన్న పనులు చేయగానే గుండె ఎక్కువగా కొట్టుకుంటుంది. దీనికి కూడా మెగ్నీషియం లోపమే కారణం.

ఈ కుక్క జాతులు సింహాన్ని సైతం చంపగలవు..!


=> రక్తపోటు అధికంగా ఉంటే మెగ్నీషియం లోపమున్నట్టు అర్థం. రక్తపోటుకు, మెగ్నీషియం స్థాయిలకు మధ్య సంబంధం ఉంటుందని అధ్యయనాసు కూడా చెబుతున్నాయి.

=> మెగ్నీషియం నిద్రను ప్రభావితం చేసే న్యూరోట్రాన్స్ మీటర్లను ప్రభావం చేస్తుంది. ఈ కారణంగా మెగ్నీషియం లోపం ఉంటే నిద్రలేమి సమస్య ఎదురవుతూ ఉంటుంది.

=> కొంతమందిలో ఎప్పుడూ తలనొప్పి సమస్య ఉంటూ ఉంటుంది. మెగ్నీషియం లోపిస్తే తలనొప్పి, మైగ్రేన్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

=> వికారం, జీర్ణసంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే అది మెగ్నీషియం లోపమయ్యే అవకాశం ఉంది. మెగ్నీషియం లోపిస్తే వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడతాయి.

ఈ కుక్క జాతులు సింహాన్ని సైతం చంపగలవు..!

ఈ ఆహారాలను పొరపాటున కూడా కలిపి తినకండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 29 , 2024 | 01:07 PM