Share News

Monsoon Food: వర్షాకాలపు అనారోగ్యాలకు ఈ 5 కూరగాయలే కారణం.. వీటిని తినకండి..!

ABN , Publish Date - Jul 01 , 2024 | 10:19 AM

సీజన్ తో సంబంధం లేకుండా కూరగాయలు మార్కెట్లో లభ్యం అవుతుంటాయి. ఈ కారణంగా చాలామంది అన్ని రకాలు తినేస్తుంటారు. అయితే వర్షాకాలంలో నివారించాల్సిన కూరగాయలు కొన్ని ఉన్నాయి.

Monsoon Food: వర్షాకాలపు అనారోగ్యాలకు ఈ 5 కూరగాయలే కారణం.. వీటిని తినకండి..!

కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని సీజన్ ల వారిగా తీసుకుంటే డబుల్ బెనిఫిట్స్ ఇస్తాయి. అయితే సీజన్ తో సంబంధం లేకుండా కూరగాయలు మార్కెట్లో లభ్యం అవుతుంటాయి. ఈ కారణంగా చాలామంది అన్ని రకాలు తినేస్తుంటారు. అయితే వర్షాకాలంలో నివారించాల్సిన కూరగాయలు కొన్ని ఉన్నాయి. వీటిని నివారించడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అవేంటో.. ఎందుకు నివారించాలో తెలుసుకుంటే..

Open Pores: ఓపెన్ పోర్స్ కు సూపర్ ట్రీట్మెంట్.. ఈ టిప్స్ ట్రై చేయండి..!



వర్షాకాలంలో అధిక తేమ, వర్షం కారణంగా కొన్ని కూరగాయలు తేమ వాతావరణాన్ని పెంచుతాయి. బ్యాక్టీరియా, శిలీంద్రాలు, సూక్ష్మజీవుల పెరుగుదలను ఇవి ప్రోత్సహిస్తాయి. అలాంటి వాటిలో ఆకుకూరలను ప్రధానంగా చెప్పవచ్చు. బచ్చలికూర, మెంతికూర, కాలే వంటి పచ్చని ఆకుకూరలలో వాతావరణంలోని తేమ వల్ల సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా పెరుగుతాయి. వర్షాకాలంలో ఆకుకూరలు తినడం వల్ల అజీర్ణం, ఇన్ఫెక్షన్లు రావచ్చు. వీటిని తినేముందు జాగ్రత్త చాలా అవసరం.

వర్షాకాలంలో కాలిఫ్లవర్, బ్రోకలీ తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటి ఆకులపై పురుగుల గుడ్లు ఉంటాయి. అలాగే వీటి లోపల కూడా పురుగులు, వాటి తాలూకు గుడ్లు ఉంటాయి. వీటిని తింటే ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఇది అనారోగ్యానికి కారణమవుతుంది.

వంకాయ మొక్క తెగుళ్ల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఆల్కలాయిడ్స్ అని పిలువబడే రసాయన సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ సమ్మేళనం వంకాయలను విషపూరితం చేస్తుంది. ఇది దురద, వికారం, దద్దుర్లు, అలెర్జీ వంటి సమస్యలకు కారణం అవుతుంది.

Life Lesson: మీ జీతం ఎంత అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? రిటైర్డ్ ఐఏఎస్ ఇచ్చిన సలహా ఇది..!



క్యాప్సికం ను కూరల్లోనే కాకుండా చాలా రకాల ఆహారాలలో జోడిస్తుంటారు. చాలామంది వీటిని పచ్చిగా తినడానికి కూడా మొగ్గు చూపుతారు. అయితే వర్షాకాలంలో క్యాప్సికం తినడం వల్ల కడుపు ఇన్ఫెక్షన్లు వస్తాయి.

బీన్స్, బఠానీలు వంటివి తేమను ఎక్కువగా నిలుపుకుంటాయి. ఇవి శిలీంద్రాల పెరుగుదలకు అనువుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వీటిని తినాలని అనుకునేవారు తాజాగా ఉన్నవాటిని ఎంచుకోవాలి. అలాగే వీటిని బాగా ఉడికించిన తరువాతే తినాలి.

Curry Leaves: రోజూ ఉదయాన్నే ఒక రెమ్మ పచ్చి కరివేపాకులు నమిలి తింటే జరిగేది ఇదే..!

Health Tips: ఈ 3 తినండి చాలు.. 60 ఏళ్లు వచ్చినా యవ్వనంగా ఉంటారు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.



Updated Date - Jul 01 , 2024 | 10:19 AM