Muskmelon Seeds: కర్భూజా తిని విత్తనాలు పడేస్తుంటారా? వీటి ప్రయోజనాలు తెలిస్తే..!
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:36 PM
కర్భూజా పండులో 90శాతం నీరు ఉంటుంది. పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. సాధారణంగా కర్బూజా పండును తినగానే అందులో ఉన్న విత్తనాలను పడేస్తుంటారు. అయితే చాలామందిని షాక్ కు గురి చేసే విషయం ఏమిటంటే ఇలా పండు తిని చెత్త బుట్టలో పడేస్తున్న విత్తనాలు మార్కెట్లో కిలో ఏకంగా 2వేల రూపాయల ధర పలుకుతున్నాయి
వేసవితాపాన్ని తీర్చుకోవడానికి శీతలపానీయాలు, కొబ్బరి నీరు, జ్యూసులు వంటి వాటి మీద ఆధారపడే వారు కొందరైతే.. పండ్ల మీద ఆధారపడే వారు మరికొందరు. పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండే వాటికి ఈ వేసవిలో బాగా డిమాండ్ ఉంటుంది. అలాంటి పండ్లలో కర్భూజా కూడా ఒకటి. కర్భూజా పండులో 90శాతం నీరు ఉంటుంది. పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. సాధారణంగా కర్బూజా పండును తినగానే అందులో ఉన్న విత్తనాలను పడేస్తుంటారు. అయితే చాలామందిని షాక్ కు గురి చేసే విషయం ఏమిటంటే ఇలా పండు తిని చెత్త బుట్టలో పడేస్తున్న విత్తనాలు మార్కెట్లో కిలో ఏకంగా 2వేల రూపాయల ధర పలుకుతున్నాయి. ఈ కర్బూజా గింజలను తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే ఇంకొక్కసారి ఈ విత్తనాలను అస్సలు పడేయరు కూడా..
రోగనిరోధక వ్యవస్థ..
కర్భూజా గింజలు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. వ్యాధులతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది. ఈ గింజలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
రాత్రి 7గంటలలోపు డిన్నర్ ఎందుకు చేయాలో చెప్పే బలమైన కారణాలివీ..!
రక్తపోటు..
అధిక రక్తపోటును తగ్గించడంలో కర్భూజా గింజలు చక్కగా పనిచేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్ సి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రణలో ఉంచుతుంది.
జీర్ణక్రియ..
ఫైబర్ అధికంగా ఉండే కర్భూజా గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కర్భూజా గింజలు తినడం వల్ల మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు నయమవుతాయి. జీర్ణక్రియ నెమ్మదిగా ఉన్నవారు కర్భూజా జలను తినడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.
చర్మ ఆరోగ్యం..
విటమిన్ ఎ, సి, ఇ కర్భూజా గింజలలో ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వయసు పెరిగే కొద్దీ తగ్గే కొల్లాజెన్‌ను పెంచడంలో ఈ విత్తనాలు సహాయపడతాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
30ఏళ్ల వయసు రాగానే మానేయాల్సిన 7 ఆహారాలు ఇవీ..!
10వ తరగతి ఫలితాల కోసం.. క్లిక్ చేయండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)