Share News

Mustard Seeds Vs Poppy Seeds: ఆవాలు, గసాలు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:13 PM

ఆవకాయ పచ్చళ్ల నుండి కొన్ని రకాల వంటల వరకు ఆవాలను పొడిగా చేసి వాడతారు. ఇలా ఆవాలు భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం అయిపోయాయి. మరొకవైపు గసగసాలు ప్రతి వంటింట్లో ఉంటాయి. మసాలా వంటకాల నుండి స్వీట్ల వరకు గసగసాలు లేనిదే..

Mustard Seeds Vs Poppy Seeds:  ఆవాలు, గసాలు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
Mustard seeds Vs Poppy Seeds

భారతీయ వంటకాలలో కొన్ని వంటకాలను పోపు తో మొదలుపెడతారు. మరికొన్ని వంటకాలు పూర్తైన తర్వాత చివరగా పోపు పెడతారు. ఎలా చేసినా పోపులో ఆవాలు తప్పనిసరిగా ఉంటాయి. కేవలం పోపులోకే కాదు.. ఆవకాయ పచ్చళ్ల నుండి కొన్ని రకాల వంటల వరకు ఆవాలను పొడిగా చేసి వాడతారు. ఇలా ఆవాలు భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం అయిపోయాయి. మరొకవైపు గసగసాలు ప్రతి వంటింట్లో ఉంటాయి. మసాలా వంటకాల నుండి స్వీట్ల వరకు గసగసాలు లేనిదే ఘుమఘుమ ఉండదు.. రుచి కూడా రాదు. అయితే ఆవాలు, గసగసాలు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది. ఈ రెండింటి మధ్య తేడాలు.. వీటిలో ఏది బెస్ట్ తెలుసుకుంటే..

వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..!


ఆవాలు..

ఆవాలు వంటల్లోనే కాకుండా సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం 100గ్రాముల ఆవపిండిలో 508 కిలో కేలరీలు ఉంటాయి. 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 36గ్రాముల కొవ్వులు ఉంటాయి. 28గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇందులో సాధారణ ఫైబర్ ఉంటుంది. ఇక వీటిలో సెలీనియం, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, విటమిన్-బి మొదలైనవి ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగిన గ్లూకోసినోలేట్స్, ఐసోథియోసైనేట్స్ వంటి సమ్మేళనాలు కూడా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు..

  • ఆవపిండిలో ఉండే సమ్మేళనాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

  • ఆవాలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియలో గొప్పగా సహాయపడుతుంది. ఇది ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

  • గుండె ఆరోగ్యానికి సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఆవాలలో ఉంటాయి.

  • ఆవాలలో ఉండే విటమిన్-బి జీవక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!


గసగసాలు..

గసగసాలు నల్లమందు మొక్క నుండి లభిస్తాయి. వీటిని మసాలా వంటకాలు, స్వీట్లలో ఎక్కువగా వాడతారు. సాంప్రదాయ వైద్యంలో కూడా వీటికి ప్రాధాన్యత ఉంది. 100గ్రాముల గసగసాలలో 525 కిలో కేలరీలు ఉంటాయి. 18గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఒమేగా-3, ఒమేగా-6 ఆమ్లాలతో సహా 42 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. 28 గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి. వీటిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్-బి పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పాలీపెనాల్స్ కూడా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు..

  • ఎముకల ఆరోగ్యానికి దోహదపడే కాల్షియం గసగసాలలో అధికంగా ఉంటుంది. గసగసాలు తీసుకుంటే ఎముకలను, దంతాలను బలంగా మారుతాయి.

  • గసగసాలలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

  • జీర్ణ ఆరోగ్యానికి డైటరీ ఫైబర్ చాలా మేలు చేస్తుంది. ఇది గసగసాలలో ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు, పేగు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

  • గసగసాలలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. రక్తహీనత ఉన్నవారికి మంచిది.

గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయల లిస్ట్ ఇదీ..!


ఏది బెస్టంటే..

  • ఆవాలలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో ఇవి సహాయపడతాయి. అంతే కాకుండా జీర్ణ ఆరోగ్యానికి, జీవక్రియకు కూడా ఇవి మంచివి.

  • గసగసాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఇందులో ఉండే ఒమేగా-3 ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి మంచివి.

  • ఆహార నిపుణలు అభిప్రాయం ప్రకారం ఇవి రెండూ వేర్వేరు ప్రయోజనాలు అందిస్తాయి. క్యాన్సర్ నిరోధించడంలో ఆవాలు, ఎముకల ఆరోగ్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో గసగసాలు అత్యుత్తమమైనవి.


ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో గ్యాడ్జెట్లు సేఫ్..!

మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 30 , 2024 | 03:13 PM