Share News

Neem Leaves: చేదుగా ఉంటాయని ఇష్టపడరు కానీ.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులు తింటే జరిగేదిదే..!

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:04 PM

వేపాకులు చేదుగా ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..

Neem Leaves: చేదుగా ఉంటాయని ఇష్టపడరు కానీ.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులు తింటే జరిగేదిదే..!
Neem Leaves

వేపాకులు చేదుగా ఉంటాయి. కానీ వేపలో ఉండే ఔషద గుణాలు మాటల్లో చెప్పలేనివి. తినగ తినగ వేము తియ్యనుండు అని వేమన తాత ఎప్పుడో వేప గురించి చెప్పాడు. దీని అర్థం వేపాకు తియ్యగా అనిపిస్తుందని మాత్రమే కాదు.. వేపను రోజూ తింటూ ఉంటే శరీరానికి చేకూరే ప్రయోజనాలు అంత గొప్పగా ఉంటాయని. చాలామంది వేపను తమ జీవనశైలి లో చేర్చుకోకపోవడానికి కారణం వేపలో ఉండే చేదు గుణమే.. కానీ వేపాకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వేప ఆకులను ఖాళీ కడుపుతో తింటే 3 రకాల జబ్బులు ఎప్పటికీ రావట. అవేంటో.. వేపాకులు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

అవకాడో తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?


మలబద్దకం..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులను నమలడం వల్ల మలబద్దకం సమస్య నుండి బయట పడవచ్చు. వేపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను పరిష్కరిస్తుంది. అంతే కాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.

చక్కెర స్థాయిలు..

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవడానికి వేప ఆకులను తీసుకోవచ్చు. వేపాకులను ఉదయం పూట ఖాళీ కడుపుతో తింటే డయాబెటిక్ రోగులకు చాలా మేలు జరుగుతుంది. వేప ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

యూట్యూబ్ షార్ట్స్ నుండి డబ్బు ఎలా సంపాదించవచ్చు తెలుసా?


కాలేయం..

ఖాళీ కడుపుతో వేపాకులను తీసుకోవడం వల్ల కాలేయానికి చాలా మేలు జరుగుతుంది. వేప ఆకులలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడికి దూరంగా ఉంచుతాయి. కాలేయ కణజాలానికి నష్టం వాటిల్లే సమస్య కూడా తగ్గుతుంది.

ఎన్ని వేపాకులు తినాలి?

అతి సర్వత్రా వర్జయేత్ అని అంటారు. అతిగా తింటే ఆరోగ్యకరమైనది కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. వేపాకులు కూడా అంతే. అందుకే సరైన ఫలితాల కోసం వేపాకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో 4 నుండి 5 ఆకులు తినవచ్చు. ఇవి కూడా ముదురుగా కాకుండా లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి.

ఇవి కూడా చదవండి..

Gooseberry Seeds: ఉసిరికాయలు తిని విత్తనాలు పడేస్తుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!

Beetroot: బీట్ రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయి.. ఈ నిజాలు తెలుసుకోండి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 28 , 2024 | 04:04 PM