Non-Stick Cookware: నాన్-స్టిక్ వంటపాత్రలు వాడుతుంటారా? ఇది తెలుసుకోకుంటే నష్టపోతారు..!
ABN , Publish Date - May 21 , 2024 | 04:43 PM
ఇప్పట్లో చాలామంది ఎంచుకునే వంటపాత్రలు నాన్-స్టిక్ కుక్ వేర్. వీటి వల్ల నూనె ఎక్కువ అవసరం లేకుండా ఆహార పదార్థం బాగా కాలి రుచిగా ఉంటుంది. కానీ నాన్-స్టిక్ పాత్రలు కొన్న, వాడుతున్న చాలామందికి వాటిని వాడాలో.. ఎలా శుభ్రపరచాలో.. ఎలా జగ్రత్తపడాలో తెలియదు.
ఇప్పట్లో చాలామంది ఎంచుకునే వంటపాత్రలు నాన్-స్టిక్ కుక్ వేర్. వీటి వల్ల నూనె ఎక్కువ అవసరం లేకుండా ఆహార పదార్థం బాగా కాలి రుచిగా ఉంటుంది. కానీ నాన్-స్టిక్ పాత్రలు కొన్న, వాడుతున్న చాలామందికి వాటిని వాడాలో.. ఎలా శుభ్రపరచాలో.. ఎలా జగ్రత్తపడాలో తెలియదు. ఈ కారణంగా నాన్-స్టిక్ పాత్రల వల్ల కలిగే మంచికంటే జరుగుతున్న నష్టమే ఎక్కువగా ఉంటోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
నాన్-స్టిక్ వంటసామాను సాధారణంగా టెఫ్లాన్‌తో పూత పూయబడి ఉంటుంది. ఇది కార్బన్, ఫ్లోరిన్ పరమాణువులతో తయారైన సింథటిక్ రసాయనం. సాధారణ ఉష్ణోగ్రత వద్ద నాన్-స్టిక్ పాత్రలలో వంట చేయడం మంచిది. కానీ అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు ఇది విషపూరిత పొగలను ఉత్పత్తి చేస్తుంది. ఇది మైక్రో.. నాన్ ప్లాస్టిక్ లతో ఆహారాన్ని కలుషితం చేస్తుంది. టెఫ్లాన్ పూత ఉన్న నాన్-స్టిక్ పాన్‌లను 170°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలకు వేడి చేస్తే ప్రమాదం. అలాగే ఖాళీ పాన్‌ను మంట మీద ఎక్కువ సేపు ఉంచితే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నాన్-స్టిక్ పాన్ లో టెఫ్లాన్ పూత అరిగిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు వాటిని వాడకపోవడం మంచిది.
పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
నాన్-స్టిక్ వంట సామాను వాడేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు..
ఖాళీ పాన్‌ని ముందుగా వేడి చేయడం మానేయాలి. ఎందుకంటే అది చాలా వేగంగా వేడెక్కుతుంది. ఇది విషపూరిత పొగలను విడుదల చేస్తుంది. అందుకే తక్కువ నుండి మధ్యస్థ మంట మీద వంట చేయడం మంచిది.
నాన్-స్టిక్ పాన్‌లలో వంట చేసేటప్పుడు చిమ్నీ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించడం మంచిది.
శుభ్రం చేసే సమయంలో నాన్-స్టిక్ కోటింగ్‌ను గోకడం మానుకోవాలి. మృదువైన స్పాంజితో శుభ్రం చేయాలి. సబ్బు, వెచ్చని నీటితో సున్నితంగా కడగాలి.
పూత చెడిపోయినప్పుడు వంటసామాను వాడటం మానేయాలి. నాన్-స్టిక్ కు బదులుగా స్టెయిన్లెస్ స్టీల్, కాస్ట్ ఇనుము, రాయి, సిరామిక్ వంటసామానులో ఉడికించడం మంచిది.
బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
చెప్పులు లేకుండా నడిస్తే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.