Share News

Oatmeal: రోజూ ఉదయాన్నే ఓట్ మీల్ తింటే ఏం జరుగుతుంది? ఆహార నిపుణులు చెప్పిన నిజాలివీ..!

ABN , Publish Date - Sep 21 , 2024 | 02:04 PM

ఆరోగ్యకమైన ఆహారాల ఎంపికలో ఓట్ మీల్ కూడా ఒకటి. దీన్ని రోజూ తింటూంటే శరీరంలో కలిగే మార్పులు ఇవే..

Oatmeal:  రోజూ ఉదయాన్నే ఓట్ మీల్ తింటే ఏం జరుగుతుంది?  ఆహార నిపుణులు చెప్పిన నిజాలివీ..!
Oatmeal

ఆహారం శరీరానికి శక్తి వనరు. ప్రతి ప్రాణికి ఆహారం తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఆరోగ్యకరమైన ఆహారంలో చాలా ఎంపికలు ఉన్నాయి. వాటిలో ఓట్ మీల్ కూడా ఒకటి. ఈ మద్య కాలంలో డైటింగ్ చేసేవారు ఎక్కువగా ఓట్ మీల్ ను తీసుకుంటున్నారు. అయితే ఓట్ మీల్ ను ప్రతి రోజూ ఉదాయాన్నే తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

పోషకాలు..

ఓట్ మీల్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి పోషణను ఇస్తాయి.

కర్పూరం కలిపిన ఆవనూనె ఎంత పవరో తెలుసా..!


జీర్ణశక్తి..

ఓట్ మీల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సాఫీగా ఉంచుతుంది. మలబద్దకం వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఓట్ మీల్ తీసుకునే వారి జీర్ణశక్తి బలంగా ఉంటుంది.

బరువు..

బరువు తగ్గాలని అనుకునేవారు ఓట్ మీల్ తీసుకుంటే చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు కడుపును నిండుగా ఉంచుతుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. ఓట్ మీల్ లో భాగంగా తీసుకునే పండ్ల వల్ల శరీరానికి అదనపు ఫైబర్, విటమిన్లు కూడా అందుతాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో సహాయంగా ఉంటాయి.

గుండె ఆరోగ్యం..

ఓట్ మీల్ లో కరికే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఉసిరికాయ రసాన్ని నెల రోజులు ఖాళీ కడుపుతో తాగితే ఏమవుతుంది?


ఎనర్జీ..

ఓట్ మీల్ లో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఉదయాన్నే ఓట్ మీల్ తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉండవచ్చు.

చర్మం, జుట్టు..

ఓట్ మీల్ లో యాంటీ ఆక్సిడెంట్లు , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి..

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..!

రోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే ఈ సమస్యలు ఉన్నవారికి భలే లాభాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 21 , 2024 | 02:04 PM