Share News

Packet Milk: ప్యాకెట్ పాలు వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

ABN , Publish Date - Sep 09 , 2024 | 05:35 PM

చాలా వరకు పాల ప్యాకెట్లు ఇంటికి తీసుకురాగానే వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచడం లేదా పాల ప్యాకెట్లను కత్తిరించి పాలను వేడి చేస్తుంటారు. కానీ..

Packet Milk: ప్యాకెట్ పాలు వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
Packet Milk

పాలు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ప్రజల ప్రధాన పోషకాహారం. పాలను నేరుగా తాగడమే కాకుండా స్వీట్లు, వంటలు, వివిధ రకాల పానీయాల తయారీలోనూ, జున్ను, వెన్న, నెయ్యి వంటి ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తారు. గ్రామాల్లో పాలను నేరుగా పశువుల పెంపకం దారులు అమ్ముతుంటారు. అధికంగా డెయిరీ ఫారాల్లో కూడా పాలను అమ్ముతారు. కానీ పట్టణాలలో మాత్రం పాలను ప్యాకెట్లు గా విక్రయిస్తారు. చాలా వరకు పాల ప్యాకెట్లు ఇంటికి తీసుకురాగానే వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచడం లేదా పాల ప్యాకెట్లను కత్తిరించి పాలను వేడి చేస్తుంటారు. అయితే ఇది చాలా తప్పు అంటున్నారు ఆహార నిపుణులు. పాల ప్యాకెట్లు వాడే వారి కోసం ఆహార నిపుణులు చెప్పిన నిజాలేంటో తెలుసుకుంటే..


White Hair: హెయిర్ డై బదులు ఇంట్లోనే ఈ హెయిర్ ప్యాక్ వేసుకోండి.. జుట్టు నల్లగా మారుతుంది..!



ప్యాకెట్ పాలు మరిగించడం మంచిదేనా?

ప్యాకెట్ పాలను అప్పటికే పాశ్చరైజ్ చేసి ఉంటారట. అంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం ద్వారా పాలలో హానికరమైన బ్యాక్టీరియా అప్పటికే నిర్మూలించబడి ఉంటుంది. ప్యాక్ చేసిన పాలను ఇంటికి తీసుకుని వచ్చి వాటిని మళ్లీ మరిగిస్తే పాలలో ఉండే అర కొర పోషకాలు కూడా నాశనం అయినట్టే అంటున్నారు. కొన్నిసార్లు ప్యాకెట్ పాలను అతిగా మరిగించడం వల్ల సీతాఫలం లోని గుజ్జులాగా చిక్కగా మారతాయి. ఇలాంటి పాలను వాడటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

పాలు తాగడం వల్ల కాల్షియం లభిస్తుందని, ఎముకలు బలపడతాయని చాలామంది అంటూ ఉంటారు. అయితే పాలు తాగడం వల్ల చాలా మందికి తెలియని ప్రయోజనాలు ఉన్నాయి.


Vitamin-D: విటమిన్-డి పుష్కలంగా లభించాలంటే.. సూర్యకాంతిలో ఏ సమయంలో గడపాలంటే..!



  • పాలు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి విటమిన్లు, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. అందుకే రోజూ కనీసం గ్లాసు పాలు అయినా తాగాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.

  • పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

  • పాలలో క్యాల్షియం పుష్కలంగా ఉన్న సంగతి తెలిసిందే.. దీని వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంటుంది.

  • పాలలో మంచి మొత్తంలో విటమిన్ డి కూడా ఉంటుంది. విటమిన్ డి ఎముకలను బలోపేతం చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

  • జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో పాల ప్రభావం కూడా కనిపిస్తుంది.

  • ఎసిడిటీ వల్ల వచ్చే గుండెల్లో మంట నుండి ఉపశమనం పొందేందుకు కూడా పాలు తాగవచ్చు. అంతేకాదు.. నీరసంగా అనిపించినప్పుడు పాలు తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా కూడా ఉంటారు.

ఇవి కూడా చదవండి..

ఏడాదికి ఒకసారి ఈ 6 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం సేఫ్..!

బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 09 , 2024 | 05:35 PM