Share News

Paneer: మీకు పనీర్ అంటే బాగా ఇష్టమా? ఈ 6 సమస్యలున్నవారు పొరపాటున కూడా తినకూడదట..!

ABN , Publish Date - Aug 08 , 2024 | 12:57 PM

పనీర్ పాల నుండి లభించే పదార్థం. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యింది. ఇది మంచి ప్రోటీన్ పదార్థం కావడంలో శాకాహారులు ప్రోటీన్ కోసం పనీర్ మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. పనీర్ వంటకాలకు హోటల్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. కానీ..

Paneer: మీకు పనీర్ అంటే బాగా ఇష్టమా? ఈ 6 సమస్యలున్నవారు  పొరపాటున కూడా తినకూడదట..!
Paneer

పనీర్ పాల నుండి లభించే పదార్థం. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యింది. ఇది మంచి ప్రోటీన్ పదార్థం కావడంలో శాకాహారులు ప్రోటీన్ కోసం పనీర్ మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. పనీర్ వంటకాలకు హోటల్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. పనీర్ బటర్ మసాలా, కడాయ్ పనీర్, పనీర్ పులావ్, పనీర్ పరాతా, పనీర్ మంచూరియా.. ఇలా చాలా రకాలు పనీర్ హిట్ లిస్టులో ఉంటాయి. అందరూ లొట్టలు వేసుకుంటూ తినే పనీర్ ను 6 రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం తినకూడదట. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

లాక్టోజ్ అసహనం..

లాక్టోజ్ అసహనం ఉన్నవారు పనీర్ ను తినకూడదు. ఇలాంటి వారు పనీర్ తింటే కడుపులో గ్యాస్, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

ఆడవారు 30ఏళ్ళ తర్వాత తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవి..!



గుండె జబ్బులు..

గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు పనీర్ ను తినకూడదు. ఇందులో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. గుండె రోగులకు ఇవి చాలా హాని చేస్తాయి.

అధిక బరువు..

అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు పనీర్ తినకూడదు. పనీర్ ప్రోటీన్ పదార్థమే అయినా, ఇది ఆరోగ్యేకరమైనదే అయినా పనీర్ లో కేలరీలు ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్ గా పనీర్ ను తింటూ ఉంటే ఇంకా బరువు పెరుగుతారు.

అధిక రక్తపోటు..

పనీర్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అదిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు పనీర్ ఎక్కువగా తింటూ ఉంటే బీపీ స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఎంత డబ్బు ఆదా చేయవచ్చో తెలుసా?


కిడ్నీ సమస్యలు..

కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్నవారు ప్రోటీన్, ఫాస్పరస్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మూత్రపిండాల పనితీరును మరింత దిగజార్ఛుతుంది.

అలెర్జీలు..

కొందరికి పాలు లేదా పాల ఉత్పత్తులు పడవు. ఇలాంటి వారికి పాల ఉత్పత్తులు ఏం తీసుకున్నా అలెర్జీ కలుగుతుంది. చర్మం మీద దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు పనీర్ కు దూరంగా ఉండాలి.

వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెంచితే నష్టాలు తప్పవు..!

నెయ్యితో మసాజ్ చేస్తే యవ్వనంగా మారతారా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 08 , 2024 | 12:57 PM