Share News

Papaya: జాగ్రత్త.. బొప్పాయిని ఈ ఆహారాలతో కలిపి అసలు తినకూడదు..!

ABN , Publish Date - Jul 02 , 2024 | 01:57 PM

బొప్పాయి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. పైగా అన్ని సీజన్ లలోనూ అందుబాటులో ఉండటం వల్ల బొప్పాయి తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బొప్పాయిని కొన్ని ఆహారాలతో తినడం అస్సలు మంచిది కాదట.

Papaya: జాగ్రత్త..  బొప్పాయిని ఈ ఆహారాలతో  కలిపి అసలు తినకూడదు..!

ఆరోగ్యానికి పండ్లు చాలా మంచివి. సాధారణ వ్యక్తులే కాకుండా మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యరంతంగా తినే పండ్లలో బొప్పాయి పండు ఒకటి. బొప్పాయి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి. పైగా అన్ని సీజన్ లలోనూ అందుబాటులో ఉండటం వల్ల బొప్పాయి తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బొప్పాయిని కొన్ని ఆహారాలతో తినడం అస్సలు మంచిది కాదట. కొన్ని ఆహారాల కాంబినేషన్లో బొప్పాయిని తింటే ఆరోగ్యానికి పెనుముప్పే అని అంటున్నారు. ఇంతకీ ఆ ఆహారాలేంటో తెలుసుకుంటే..

పాలు. పాల ఉత్పత్తులు..

బొప్పాయితో పాటూ మాత్రమే కాకుండా బొప్పాయి తిన్న తరువాత కూడా పాలు, పెరుగు, చీజ్, పనీర్ వంటి పాల ఉత్పత్తులు కూడా తీసుకోకూడదు. బొప్పాయిలో ఉండే పాపైస్ పాలలో ఉండే కేసైన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తుంది. ఈ కేసైన్ పాలకు తెలుపు రంగును ఇస్తుంది. ఇది విచ్చిన్నం కావడం వల్ల పాలు విరిగిపోయినట్టు అవుతాయి. ఇది మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలకు దారితీయవచ్చు.

కలోంజి విత్తనాలను తేనెతో కలిపి తింటే జరిగేదేంటి?


టీ..

బొప్పాయి తిన్న తరువాత పొరపాటున కూడా టీ తాగకూడదు. బొప్పాయి లో ఉండే పపైన్ అనే సమ్మేళనం .. టీ ఆకులలో ఉండే కాటెచిన్ తో ప్రతిస్పందనలు జరుపుతుంది. ఇది గుండెల్లో మంట, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగిస్తుంది.

గుడ్లు..

గుడ్లలో ప్రోటీన్, ఒమేగా-3, బొప్పాయిలో ఉండే పపైన్.. రెండూ కలిస్తే అజీర్ణం, వికారం, మలబద్దకం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

రోజూ ఏలకుల నీటిని తాగుతుంటే ఏం జరుగుతుందంటే..!


నిమ్మకాయ..

బొప్పాయి తిన్న తరువాత నిమ్మకాయి తీసుకోవడం మంచిది కాదు. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోవడానికి కారణం అవుతుంది. రక్తహీనత ప్రమాదం పెరుగుతుంది.

ఫైబర్ ఆహారాలు..

బొప్పాయి తిన్న తరువాత బీన్స్, క్యాబేజీ, బ్రోకలీ వంటి అధిక ఫైబర్ ఆహారాలు తీసుకోవడం వ్ల జీర్ణ సమస్యలు తీవ్రమవుతాయి.

Protein Food: ఈ 5 ఆహారాలు తింటూ ఉంటే చాలు.. పోషకాహార లోపం మిమ్మల్ని టచ్ చేయదు..!


Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొరపాటున కూడా వీటిని తినకండి..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 02 , 2024 | 01:57 PM